More

    ఢిల్లీ లిక్కర్ స్కాం: నేడు అభిషేక్ రావు అరెస్ట్.. రేపెవరో..?

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన మరొకరిని సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసి ఢిల్లీకి సీబీఐ తరలిస్తోంది. ఇప్పటివరకు ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. అభిషేక్ రావుకి 9 కంపెనీలతో సంబంధం వుంది.కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నాడు. ఆ 9 కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి. అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్‌లో డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అనూస్ బ్యూటీపార్లర్‌లోనే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆయన వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. 9 కంపెనీల్లో అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా.. అభిషేక్ రావు అరెస్ట్ రెండోది.

    Trending Stories

    Related Stories