More

    ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కలకలం

    ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను ఆమె ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ కు నిందితులు కారును తీసుకుని వెళ్లారు. సుమారు 44 కిలోమీటర్లు కారు వెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి దగ్గరే ఉంటున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

    జూలై 6న స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం వసంత్ విహార్ మార్కెట్‌లో ఇద్దరు నిందితులను కలిశానని బాలిక తన వాంగ్మూలంలో పోలీసులకు తెలిపింది. 10వ తరగతి చదువుతున్న బాలికతో పాటూ వారు తిరిగారు. కొద్దిసేపటికి మూడో నిందితుడిని పిలిచారు. అతనితో పాటు కారును కూడా తీసుకొచ్చారు. నిందితుడు కారులోకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కారు నగరంలో తిరుగుతుండగా ఆమెను కొట్టారు. వారు అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో కూడా రూపొందించినట్లు తెలిసింది. రెండు రోజుల తర్వాత బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సంప్రదించగా పోలీసులకు విషయం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి 23, 25 మరియు 35 ఏళ్ల వయసున్న ముగ్గురిని అరెస్టు చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories