ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ వేగాన్ని పెంచింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటి సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సిసోడియాతో పాటు ఈ కేసులో మరో నిందితుడి హైదరాబాద్‌కు చెందిన రామచంద్రపిళ్లెకి సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులకు సిసోడియాకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. పలువురు వ్యక్తులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారించాయి. తెలంగాణకు చెందిన అభిషేక్ రావును సీబీఐ అధికారులు విచారించారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు.