2020 ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్ల కేసులో కర్కర్డోమ డిస్ట్రిక్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు అతడి సోదరుడు, మరో నలుగురిపై తీవ్రమైన నేరాభియోగాలతో చార్జిషీట్ దాఖలు చేసింది. వీరందరూ పక్కా ప్రణాళికతోనే ఢిల్లీ అల్లర్లను రెచ్చగొట్టారని కోర్టు పేర్కొంది. ప్రధానంగా హిందువులను టార్గెట్‌గా చేసుకుని ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించినట్టు డిస్ట్రిక్ కోర్టు భావించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ‘జస్టిస్ పాలస్త్య ప్రమాచల’ ఈ కేసును విచారించి నిందితులందరూ ఉద్దేశపూర్వకంగానే అల్లర్లకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ అల్లర్లలో ఆరుగురు ప్రధాన నిందితులకు సెక్షన్ 120-బి తో పాటు ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 153A, 302, 307 ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో పాటు నిందితుల్లో గుల్ఫమ్, తన్వీర్లపై స్పెషల్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 27ను కూడా ప్రయోగించారు. దీంతో నిందితులందరిపై కేసులు విచారణ జరగనుంది.
నిందితులందరూ 2020లో ఢిల్లీలో జరిగిన హింసాత్మక అల్లర్లలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టంతో షాహీన్ బాగ్‌లో పెద్దయెత్తున నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో పలువురు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. భారత్‌లోని ఈశాన్యరాష్ట్రాలను ఇతర రాష్ట్రాలతో కలిపే చికెన్ నెక్ కారిడార్‌ను దిగ్భందిస్తే.. ఆ రాష్ట్రాలను భారత్ నుంచి విడదీయవచ్చనే సందేశాలూ వినిపించాయి. ఈ విధంగా నెలల తరబడి సాగిన షాహీన్ బాగ్ నిరసనలు.. ఫిబ్రవరి 23 న అల్లర్లకు దారితీసాయి. ఈశాన్య ఢిల్లీలో మొదలైన అల్లర్లలో హిందువులే టార్గెట్‌గా పదుల సంఖ్యలో హత్యలు జరిగాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
ముందుగానే ప్రణాళిక రచించుకున్నట్టు,.. ఇంటిపై రాళ్ళ గుట్టలతో పాటు, పెట్రోల్ బాంబులు నాటు తుపాకులను కూడా ఉపయోగించారు. ఈ ఆయుధాలన్నిటినీ స్థానిక కౌన్సిలరైన తాహిర్ హుస్సేన్ సమకూర్చాడు. తాహిర్ హుస్సేన్ సమక్షంలో స్థానిక ముస్లింలను హిందువులపైకి రెచ్చగొట్టాడు. హిందువులపై దాడులు చేసి చంపివేయడం, వారిని భయభ్రాంతులకు గురవడం లాంటివి చేశాడు. దీంతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగిగా ఉన్న అంకిత్ శర్మను కూడా తాహిర్ హుస్సేన్ హత్య చేయించాడు. పాత కక్షలన్నిటినీ ఒకేసారి తీర్చుకున్నట్లు అకిత్ శర్మ శరీరంపై 50కి పైగా కత్తిపోట్లు పొడిచి అక్కడే ఉన్న మురుగు కాల్వలో పడేశారు. ఈ విధంగా జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 200 మంది వరకు గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో జరిగిన హత్యల్లో తాహిర్ హుస్సేన్ తో పాటు అతడి అనుచరులు ప్రధాన నిందితులుగా పేర్కొంటూ పోలీసులు వీరందరినీ అరెస్టు చేశారు.
ఇక తాజాగా ఈ కేసు విచారణకు రావడంతో,.. ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుస్సేన్ తో పాటు నిందితులందరిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయమని అడిషనల్ సెషన్స్ జడ్జి ఆదేశించారు. దీంతో ఈ నిందితులపై కోర్టులో విచారణ జరిగి నిందితులందరికీ శిక్షలు పడే అవకాశముంటుంది. ఈ కేసును కోర్టులు జాప్యం చేయకుండా తాహిర్ హుస్సేన్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.