National

ఓ వైపు షోలు క్యాన్సిల్.. అమీర్ ఖాన్ పై న్యాయవాది ఫిర్యాదు

అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పేలవమైన ప్రదర్శనను కనబరుస్తోంది. దీంతో ఎగ్జిబిటర్లు 1300 షోలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇక సినిమాను వివాదాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. విడుదలైన తర్వాత సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా.. భారత సైన్యాన్ని కూడా అవమానించేలా ఉన్నాయని చెప్పారు. దీంతో అమీర్ ఖాన్‌పై ఫిర్యాదు చేశారు. అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ పాత్రలో భారత ఆర్మీ సిబ్బందిని అవమానించారని ఆరోపిస్తూ ఢిల్లీలోని వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని ఓ సన్నివేశం మతపరమైన భావోద్వేగాలను కించపరిచేలా ఉందని వినీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులో “సినిమాలో కార్గిల్ యుద్ధంలో పోరాడటానికి ఒక మానసిక వికలాంగుడిని ఆర్మీలో చేరడానికి అనుమతించినట్లు చూపించారు. కార్గిల్ యుద్ధంలో పోరాడేందుకు అత్యుత్తమ ఆర్మీ సిబ్బందిని పంపారని, కఠినంగా శిక్షణ పొందిన ఆర్మీ సిబ్బంది యుద్ధం చేశారని అందరికీ తెలిసిన విషయమే, అయితే సినీ నిర్మాతలు ఉద్దేశ్యపూర్వకంగానే భారత సైన్యం పరువు తీయడానికి ప్రయత్నించారని’ పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అమీర్ ఖాన్, పారామౌంట్ పిక్చర్స్, దర్శకుడు అద్వైత్ చందన్ లపై ఫిర్యాదు చేశారు.

Related Articles

Back to top button