National

ఛాంబర్ లోనే మత మార్పిడులకు పాల్పడుతున్న అడ్వొకేట్ ఇక్బాల్ మాలిక్

మత మార్పిడులకు పాల్పడుతున్న న్యాయవాది ఇక్బాల్ మాలిక్ లైసెన్స్ ను ఢిల్లీ బార్ కౌన్సిల్ రద్దు చేసింది. మతమార్పిడులకు పాల్పడడమే కాకుండా నికా (ఇస్లామిక్ వివాహం) కోసం తన గదులను ఉపయోగించినందుకు న్యాయవాది ఇక్బాల్ మాలిక్ లైసెన్స్‌ను ఢిల్లీ బార్ కౌన్సిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఇలాంటి ప్రవర్తన న్యాయ వృత్తి గౌరవానికి చెడ్డపేరు తీసుకువస్తుంది’ అని ఢిల్లీ బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఇక్బాల్ మాలిక్ పై ఆరోపించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు అనుమతించబడవు.. ఇలాంటివి న్యాయవాది వృత్తిపరమైన కార్యకలాపాలలో భాగం కాదు నిఖాలను నిర్వహించడం తప్పు అని బార్ కౌన్సిల్ తెలిపింది. మీరే నిఖా చేయించి ధృవీకరణ పత్రం జారీ చేయడం పూర్తిగా అవమానకరమైనది బార్ కౌన్సిల్ అభిప్రాయ పడింది. ఇలాంటి పనులను న్యాయ వృత్తి నిరాకరిస్తుంది అని బార్ కౌన్సిల్ వెల్లడించింది.

ఫిర్యాదులోని పత్రాలను పరిశీలిస్తే ఛాంబర్ / కోర్ట్ ప్రాంగణంలో నిఖాను నిర్వహించే కార్యకలాపాలను ఒక న్యాయవాది లేదా మరే వ్యక్తి అయినా అనుమతించరని బార్ కౌన్సిల్ తెలిపింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ 43 వ నిబంధన మరియు సెక్షన్ 6 (1) (డి) న్యాయవాదుల చట్టం, 1961 ఈ సమస్యపై ప్రత్యేక క్రమశిక్షణా కమిటీని సిఫారసు చేశాం. మధ్యంతర చర్యగా, క్రమశిక్షణా కమిటీ తీర్మానం చేసే వరకు మీరు ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు.. మీ లైసెన్స్‌ను నిలిపివేయడం జరుగుతోందని.. ఇదే సముచితమని భావిస్తుందని బార్ కౌన్సిల్ ఇక్బాల్ మాలిక్ కు తెలిపింది.

తన కుమార్తె బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిందని ఒక తండ్రి ఫిర్యాదు చేయడంతో పాటూ ఆమెను కోర్టులోని న్యాయవాది గదిలో వివాహం చేశారని ఫిర్యాదు చేశారు. కోర్టులో ఉన్న గదిని పత్రాలలో మసీదుగా చూపించినట్లు బాధితురాలి తండ్రి వాదించాడు. అయితే ఇదంతా ఇక్బాల్ మాలిక్ ఛాంబర్ లోనే చోటు చేసుకుందని తెలుస్తోంది. అందుకే అతడిపై బార్ కౌన్సిల్ క్రమ శిక్షణా చర్యలకు ఉపక్రమించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eleven − 3 =

Back to top button