More

    రాజ్ నాథ్ సింగ్ కు కరోనా

    కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ ఐసోలేషన్ లో ఉండాలని, తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం తెలిపారు.

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆయన స్వయంగా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తాలూకు బలమైన లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తల రక్షణ కోసం ఈసీ చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ కోరారు. సుప్రీంకోర్టులో కూడా కరోనా కలకలం చెలరేగింది. సుప్రీంకోర్టులో 150 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుప్రీంకోర్టులో మొత్తం 3 వేల మంది వరకు సిబ్బంది ఉంటారు. సుప్రీంకోర్టు ఆవరణలోనే ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సుప్రీంకోర్టు ఓ ప్రకటన జారీ చేసింది. పార్లమెంటులో 400 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్ లో మొత్తం 1,409 మంది పనిచేస్తుండగా జనవరి 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో భారీగా కేసులు బయటపడ్డాయి. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడడంపై ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన సిబ్బందిలో వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు అధికారులు తెలిపారు.

    Trending Stories

    Related Stories