National

ఐఎన్ఎస్ విక్రాంత్ ను పరిశీలించిన రాజ్ నాథ్ సింగ్

శుక్రవారం కొచ్చిలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను వచ్చే ఏడాదే ప్రారంభిస్తామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక భాగమని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా దేశానికి ఈ నౌకను వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ తో తీర ప్రాంతంలో దేశ ప్రయోజనాలను కాపాడుకోవచ్చని అన్నారు. ‘ప్రాజెక్ట్ సీ బర్డ్’ పేరిట కర్వార్ లో నిర్మిస్తున్న అతిపెద్ద నౌకదాళ బేస్ పైనా ఆయన సమీక్ష నిర్వహించారు. నేవీ అధికారులు ఇతర నావిగేషనల్, కమ్యూనికేషన్, కార్యాచరణ వ్యవస్థలను సమగ్రపరచడంలో సాధించిన పురోగతిని గురించి కూడా వివరించారు. నౌకాదళాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆధునికీకరణపై తాము చూపిస్తున్న శ్రద్ధ వల్లే దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యం దక్కుతోందని చెప్పారు. 44 యుద్ధ నౌకల్లో 42 నౌకలను భారత షిప్ యార్డుల్లో తయారు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో 75 శాతం వరకు స్వదేశీ సామగ్రినే వాడుతున్నామని రాజ్ నాథ్ చెప్పారు. ఉక్కు నుంచి నిర్మాణం వరకు, సెన్సర్ల నుంచి ఆయుధాల వరకు దేశీయంగా తయారు చేసినవేనన్నారు. ప్రాజెక్ట్ 75ఐ ఆర్ఎఫ్పీ (ప్రతిపాదనలు)కి ఇటీవలే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఆమోదం ఇచ్చిందన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉందని అన్నారు. గాల్వాన్ ఘర్షణల సమయంలో నౌకాదళం ఎంత వేగంగా స్పందించిందో గుర్తు చేశారు. కరోనా మహమ్మారితో పోరులోనూ నేవీ కృషి ఎనలేనిదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన ద రీజియన్– ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమగ్రాభివృద్ధి, భద్రత)’ కింద ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. నౌకాదళాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామన్న రాజ్ నాథ్.. ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు ‘ప్రాజెక్ట్ సీ బర్డ్’ పేరిట కార్వార్ లో నిర్మిస్తున్న అతిపెద్ద నౌకదాళ బేస్ ప్రాజెక్టులే రక్షణ రంగంలో తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్‌ ను భారత నేవీలో అత్యంత శక్తివంతమైన ఆస్తిగా చెబుతున్నారు. ఈ నౌక మిగ్ -29 కె యుద్ధ విమానం, కమోవ్ -31 ఎయిర్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్లు, త్వరలో ప్రవేశపెట్టనున్న ఎంహెచ్ -60 ఆర్ మల్టీ-రోల్ హెలికాప్టర్లను, దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లను కూడా మోయగలదు. ఎయిర్ ఇంటర్‌డిక్షన్, యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, ప్రమాదకర మరియు రక్షణాత్మక కౌంటర్-ఎయిర్, జలాంతర్గామిలను కూడా నాశనం చేయడం, వాయుమార్గంలో ఏదైనా ముప్పు పొంచి ఉన్నా అలర్ట్ చేసి.. ఎదుర్కోగ శక్తి ఐఎన్ఎస్ విక్రాంత్ కు ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 4 =

Back to top button