Telugu States

యాదాద్రిలో కుంగిన బండలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఫ్లోరింగ్ మరోసారి కుంగింది. కొద్దిపాటి వానకే నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బండలు దాదాపు 10 మీటర్ల మేర 3 ఇంచుల కిందకి కుంగాయి. అత్యున్నత ప్రమాణాలతో ఆలయాన్ని పునర్నించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇలా జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. గతంలో కూడా కొద్దిపాటి వానకే ఫ్లోరింగ్ కుంగడంతో రాతిబండలు తొలగించి మరమ్మత్తులు చేశారు. గట్టినేల వచ్చే వరకు బోర్‌వెల్‌తో రంధ్రాలు చేసి అందులో సిమెంట్, కాంక్రీట్‌తో నింపారు. వాటిపై బండలతో ఫ్లోరింగ్ వేసినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం యాదాద్రిలో కుంగిన బండలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

Related Articles

Back to top button