ఢిల్లీ జెఎన్‌యు క్యాంపస్ లో చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన మృతదేహం

0
862

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తికి సంబంధించిన కుళ్ళిన మృతదేహం కనుగొనబడింది. మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహం గురించి శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు కాల్ రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహం బాగా కుళ్లిపోయిందని, అతను చనిపోయి కొన్ని రోజులయ్యిందని పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని తెలుస్తోంది. మరణించిన వ్యక్తి గుర్తింపును తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ మృతదేహం విద్యార్థిదేనా, లెక్చరర్ దా.. లేక బయటి వ్యక్తిదేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు.