More

  బెంగాల్ లో ఎమర్జెన్సీ విధించమని కోరుతున్న కాంగ్రెస్

  పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మారణహోమాలు, సజీవ దహనాలు, హత్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బీర్భూమ్ లో చోటు చేసుకున్న దారుణంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బెంగాల్ లో ఎమర్జెన్సీ విధించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆరోపిస్తూ రాష్ట్రంలో ఆర్టికల్ 355ని విధించాలని పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ఆదివారం డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో విద్యార్థి నాయకుడు అనిస్ ఖాన్ అనుమానాస్పద మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మిస్టర్ చౌదరి హౌరాలోని కడమతల నుండి నగరం ఎస్ప్లానేడ్ ప్రాంతానికి పాదయాత్ర చేశారు.

  “పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో దారుణాలు ఒకదాని తర్వాత మరొకటి సంఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థి నాయకుడు అనిస్ ఖాన్‌ను అతని ఇంటి మూడవ అంతస్తు నుండి క్రిందికి నెట్టారు. నిజమైన కుట్రదారులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని అన్నారు. ” బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్‌లో జరిగిన అనాగరిక సంఘటనలో మహిళలు, పిల్లలు సహా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. ఝల్దా మునిసిపాలిటీలో మా కౌన్సిలర్ తపన్ కందు పాయింట్-బ్లాంక్ రేంజ్ నుండి చంపబడ్డాడు, కానీ సరైన విచారణ జరగలేదు. ఈ సంఘటనలన్నీ రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలడం, పాలక TMC చేస్తున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి” అని బహరంపూర్ ఎంపీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని, ఆర్టికల్ 355ని ప్రకటించడానికి తాము మద్దతు ఇస్తున్నామని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు రంజన్ చౌదరి విలేకరులతో అన్నారు.

  రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ఎమెర్జెన్సీ విధానం ద్వారా కేంద్రం జోక్యం చేసుకుని, బాహ్య దురాక్రమణ లేదా అంతర్గత భంగం నుండి రాష్ట్రాన్ని రక్షించవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో ఎమర్జెన్సీని ఏర్పాటు చేయనందుకు బీజేపీని విమర్శించారు.

  Trending Stories

  Related Stories