More

    చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు

    తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. తనకు ‘ఐసిస్ కాశ్మీర్’ నుంచి ప్రాణహాని ఉందని గంభీర్ పోలీసులను ఆశ్రయించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తనకు ‘ఐసిస్ కాశ్మీర్’ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారని సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ మీడియాకి తెలిపారు. విచారణ జరుగుతోందని.. గంభీర్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేసామని డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. “నవంబర్ 23 రాత్రి 9.32 గంటలకు MP గౌతమ్ గంభీర్ అధికారిక IDకి ISIS-కాశ్మీర్ నుండి ఇమెయిల్ వచ్చింది” అని గంభీర్ PS దాఖలు చేసిన ఫిర్యాదులో ఉంది. IANS ద్వారా యాక్సెస్ చేయబడిన మెయిల్ లో “మేము నిన్ను మరియు మీ కుటుంబాన్ని చంపబోతున్నాము.” అని ఉంది.

    బలమైన జాతీయవాది, 40 ఏళ్ల క్రికెటర్-రాజకీయవేత్త గంభీర్ కాశ్మీర్ లో ఉగ్రవాద సమస్య గురించి చాలాసార్లు తన గొంతుకాను వినిపించారు. అంతకుముందు డిసెంబర్ 2019లో కూడా, అంతర్జాతీయ నంబర్ నుండి తనకు మరియు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి తన కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. ఇప్పుడు మరోసారి కూడా గంభీర్ ను చంపేస్తామనే మెయిల్ వచ్చింది. ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని గౌతమ్ గంభీర్‌ ఇంటి ముందు ఢిల్లీ పోలీసులు బుధవారం ఉదయం నుండి భద్రతను పెంచారు.

    Trending Stories

    Related Stories