అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర

0
956

ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని గ్యాంగ్ స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్ప రై బతికున్నప్పుడు మన్విత్ రాయ్, గుణరంజన్ శెట్టిలు కుడి, ఎడమ భుజంగా ఉండేవారు. ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ రాయ్ స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు మన్విత్ రాయ్ కుట్ర పన్నినట్టు సమాచారం. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్ తనకు భద్రత కల్పించాలని కోరారు. అనుష్కకు ఇద్దరు సోదరులు.. వీరు గుణరంజన్ షెట్టి, రమేశ్ షెట్టి.

గుణరంజన్ శెట్టికి హత్య బెదిరింపులు రావడంతో భద్రత కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. తమకు రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుణరంజన్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయకర్ణాటక జనపర వేదిక సభ్యులు ఆదివారం హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు వినతిపత్రం సమర్పించారు.
మిత్రుల నుంచి శత్రువులుగా మారిన మన్విత్ రాయ్, రాకేష్ మల్లి నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని సభ్యులు ఆరోపించారు.