More

    రమ్య హంతకుడికి ఉరి శిక్ష ఖరారు

    గతేడాది గుంటూరు నడిరోడ్డుపై పరమయ్య కుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యను దారుణంగా కత్తితో పొడిచి చంపిన కేసులో నిందితుడు కుంచాల శశికృష్ణకు గుంటూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. ప్రేమ వేధింపులు ఎక్కువ కావడంతో నిందితుడి ఫోన్ నంబర్‌ను రమ్య బ్లాక్ లిస్టులో పెట్టింది. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గత సంవత్సరం ఆగస్టు 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో శశికృష్ణ దారుణంగా పొడిచి హత్య చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా నిందితుడు శశికృష్ణను నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. హత్య ఘటనపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.9 నెలల పాటు కొనసాగిన హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. నేడు తుది తీర్పును వెల్లడించారు.

    Trending Stories

    Related Stories