డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

0
813

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు న‌రేంద్ర మోదీ స‌ర్కారు తీపి క‌బురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డియ‌ర్‌నెస్ అల‌వెన్స్ (డీఏ)ను మ‌రో 4 శాతం పెంచుతున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. డీఏ పెంపుతో కేంద్ర ప్ర‌భుత్య ఉద్యోగుల డీఏ శాతం మూల వేతనంలో 38 శాతానికి చేరింది. ఈ డీఏ పెంపు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు పింఛ‌న్‌దారుల‌కు కూడా వ‌ర్తించ‌నున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో 50 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, 62 ల‌క్ష‌ల మంది పింఛ‌న్‌దారుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది.