మోదీజీ జోషిమఠ్‎ను ఆదుకోండి..!

0
864

ఆపద్బాంధవా ఆదుకో.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ఇటీవలికాలంలో ఇలాంటివి ఎన్నో విన్నపాలు వస్తున్నాయి. పరాయి పాలనాకాలంలో.. వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. పవిత్ర హిందూ దేవాలయాలు, ఆలయ ప్రాకారాల్లో అన్యమతస్థులు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు తొలగించడంలో, తిరిగి హిందూ దేవాలయాలకు పూర్వవైభవం రప్పించడంలో.. ఆయనకు ఆయనే సాటి అనేలా.. ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంటున్నారు.

అధికారం మోదీ ప్రభుత్వం శిథిలస్థితిలో వున్న ప్రాచీన ఆలయాలు, అన్యాక్రాంతమైన పవిత్ర కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి విశేష కృషి చేస్తోంది. సోమనాథ్ నుంచి జ్ఞాన్వాపి వరకు, ఇండిక్ వైభవాన్ని తిరిగి నింపడానికి ప్రభుత్వం విశేషంగా పని చేస్తోంది. ప్రాభవాలన్ని కోల్పోతున్న భగవాన్ బద్రీనాథ్ మందిరం, జోషిమఠ్ శీతాకాల నివాసాలపై ప్రధాని మోదీ తక్షణం దృష్టి సారించాల్సి వుందని కోరుతున్నారు. మానవ నిర్మితాల వల్ల, ప్రకృతి వైపరీత్యాలతో జోషిమఠ్ మునిగిపోతోంది. ఈ మఠ్ ను పరిరక్షించడం మీ వల్లే సాధ్యం అవుతుంది.. వెంటనే మీరు శ్రద్ధ వహించి.. జోషిమఠ్ ను కాపాడండి అంటూ మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, నదీ కోత, వేగవంతమైన ప్రాజెక్ట్ నిర్మాణాలు, భవనాల అక్రమ నిర్మాణాలు వంటి కారణాల వల్ల జోషిమఠ్ ప్రాంతం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఉత్తరాఖండ్‌లోని సుందరమైన హిల్‌స్టేషన్‌ను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పుష్కర్‌లోని పురాతన బ్రహ్మ మందిరాన్ని తక్షణమే పునరుద్ధరించాల్సి వుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఈ ప్రాంతాలను పరిశీలించింది. చమోలి జిల్లా జోషిమత్ లోని అనేక ప్రాంతాలు మానవ నిర్మిత, సహజ కారణాల వల్ల మునిగిపోతున్నాయని ఈ బృందం కనుగొంది. నిర్మాణ నిషేధంతో పాటు, ఇక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఆవశ్యకతను వివరించింది.
వేగవంతమైన నేల కోత, భూకంప కారణాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జోషిమఠ్ కు చేటు వాటిల్లుతోందని నిపుణుల ప్యానెల్ కనుగొంది. తపోవన్ విష్ణుగడ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న సొరంగం పట్టణం గుండా వెళుతున్న విషయాన్ని స్థానికులు తెలిపారు.

జోషిమఠ్ పట్టణం ఉత్తరాఖండ్‌లో 6 వేల అడుగుల ఎత్తులో ఉంది. భారత్ – చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నందున ఇది భారీ వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగిన ప్రదేశంగా పరిగణించబడింది. ఇది బద్రీనాథ్‎తో పాటు, సిక్కుల పుణ్యక్షేత్రం హేమకుండ్ సాహిబ్, ఔలీ స్కీయింగ్ గమ్యస్థానం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘పూల లోయ’కు సైతం ప్రవేశద్వారంగా వుంది.

జ్యోతిర్మఠ్ లేదా జోషిమఠ్ ను 8వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పురాతన వృక్షం కూడా వుంది. భారతదేశ వారసత్వం, సంస్కృతిని కలిగి వున్న ఈ పట్టణానికి పర్యాటకులు విరివిగా వస్తారు. పవిత్ర తీర్థయాత్రా ప్రదేశంగాను దీనికి పేరుంది. మెట్రో నగరాల కాంక్రీట్ జంగిల్స్ నుంచి తప్పించుకుని, ఆహ్లదకర వాతావరణంలో సేద తీరడానికి ఈ ప్రాంతం ఎంతో దోహదం అవుతుంది.

భారతదేశ పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇవి ఎన్నో ఉత్తమ ఫలితాలు ఇచ్చాయి. బిజినెస్ స్టాండర్డ్ 2019 నివేదిక ప్రకారం, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం పోటీతత్వ సూచికలో దేశం ఆరు స్థానాలు పైకి ఎగబాకింది. ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

సోమనాథ్ నుండి జ్ఞానవాపి వరకు, మోదీ ప్రభుత్వం పర్యాటక రంగం కోసం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలను పునరుద్ధరించింది. జ్ఞానవాపిని పరిగణనలోకి తీసుకుంటే, హిందూ పుణ్యక్షేత్రాల క్షీణతను తిరిగి స్థాపించడంలో ప్రభుత్వం ఏ రాయిని వదిలిపెట్టడం లేదు. భారతదేశం-చైనా సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జోషిమఠ్ పై తక్షణ శ్రద్ధ అవసరమని హైందవ జాతి కోరుతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 + 1 =