More

    నుపుర్ ఫోటో స్టేటస్ పెట్టినందుకు తలనరికారు.. ఎక్కడో తెలుసా..?

    రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను సపోర్టు చేసినందుకు ఓ టైలర్ ను దారుణంగా హత్య చేశారు.

    మాల్దాస్ వీధి ప్రాంతంలో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు పొట్టనబెట్టుకున్నారు. అతను కొన్ని రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని హత్య చేసినట్లు నిందితులు వీడియో విడుదల చేశారు. తలనరకడం గురించి మాట్లాడుతూ నుపుర్ శర్మను సపోర్టు చేసినందుకే ఆ వ్యక్తిని హత్య చేసినట్లు వెల్లడించారు. అలాగే ప్రధానమంత్రి మోడీని కూడా ఆ వీడియోలో బెదిరించారు.

    ఘటనపై ఉదయ్‌పూర్ ఎస్పీ మాట్లాడుతూ.. దారుణ హత్య జరిగిందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, కొంతమంది నిందితులను గుర్తించామని, నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, వీడియోపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ఇదిలా ఉండగా, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, “ఉదయ్‌పూర్‌లో యువకుడి దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ఈ సంఘటనలో పాల్గొన్న నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాము, శాంతిని కాపాడాలని. ఆ వీడియోను షేర్ చేయవద్దని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.

    Trending Stories

    Related Stories