More

    48 గంటల్లోనే మళ్లీ నేపాల్ పీఎంగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం

    పవర్ పాలిటిక్స్ లో ఏ క్షణానికి ఏమి జరుగునో…చెప్పడం కష్టమైనా పనేనని అంటున్నారు కొంతమంది రాజకీయ పండితులు..! అందుకు నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీనే ఉదాహరణగా పేర్కొంటున్నారు. నేపాల్ దిగువ సభ విశ్వాసాన్ని పొందలేక… ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా రాజీనామా చేసి అలా 48 గంటలు గడిచాయో లేదో… మళ్లీ ఆయనే నేపాల్ నూతన ప్రధానిగా నియమితులయ్యారు.

    ప్రజాస్వామ్యం అంటే ప్రజల విశ్వాసం పొందడమేనని అంటారు కొంతమంది పొలిటికల్ థింకర్స్. కానీ ఇది నిజమంటే నమ్మలేని పరిస్థితి.! ఈ ఆధునిక యుగంలో డెమోక్రసీ అంటే … జస్ట్ నంబర్ గేమ్ గా మారిపోయింది. ఇదే ఇప్పటి నిజం.!

    నేపాల్ లో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులే జరిగాయి. మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్, అలాగే కేపీ శర్మ ఓలీ తమ పార్టీ అధికారంలోకి వస్తే చెరో రెండున్నర సంవత్సరాలు పీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం చేసుకున్నారు. ఆతర్వాత మిగిలిన కమ్యూనిస్టు నాయకులు సైతం వీరితో జత కలిశారు. అంతా ఏకమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ పేరుతో ఒక గొడుగు కిందకు వచ్చారు.  కేపీ శర్మ ఓలీ పీఎం అయ్యాడు. అయితే పీఎంగా మారిన నాటి నుంచే కేపీ శర్మ ఓలీ చైనా చేతిలో కీలుబొమ్మగా మారడనే ప్రచారం మొదలైంది. నేపాల్ ను అప్పనంగా చైనా కంపెనీలకు అప్పగించేశాడనే విమర్శలు మొదలయ్యాయి. నేపాల్ కు ప్రధాని ఓలీనా.., లేక నేపాల్ రాయబారినా అంటూ అనేకమంది నెటిజన్లు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు.

     ఇదిఇలా ఉంటే…, ప్రచండతో చేసుకున్న ఒప్పందానికి సైతం తూట్లు పోడిచాడు. రెండున్నరేళ్ల తర్వాత కూడా తానే పీఎంగా ఉంటానని ప్రకటించాడు. అంతేకాదు పార్టీలో ప్రచండ కు చెక్ పట్టేలా వ్యూహాలు రచించాడు. దీంతో అప్రమత్తమైన ప్రచండ తన మద్దతుదారులతో కలిసి..ఓలీకి చెక్ పెట్టాడు. దీంతో నేపాల్ ప్రెసిడెంట్ చేత… తన ప్రభుత్వాన్ని రద్దు చేయించి.., మధ్యంతర ఎన్నికలకు సైతం సిద్ధమయ్యాడు. దీంతో విపక్షాలు సుప్రీం కోర్టుకు వెళ్లడం.., నేపాల్ అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయాలను సుప్రీం ధర్మాసనం తప్పుపట్డంతో మధ్యంతర ఎన్నికలు రద్దు అయ్యాయి. 275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభలో ఓలీ ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరీక్షలో ఓలీకి మద్దతుగా 93 ఓట్లు రాగా…, వ్యతిరేకంగా 124 ఓట్లు పడ్డాయి. మరో 15 మంది తటస్థంగా ఉన్నారు. కొంతమంది ఎంపీలు ఓటింగ్ కు డుమ్మా కొట్టారు. దీంతో నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఆటోమేట్టిగానే ఓలీ తన ప్రధాని పదవిని కోల్పోయారు.

    ఆ తర్వాత నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ ప్రచండ, జనతా సమాజ్ వాదీ పార్టీ నేత ఉపేంద్ర యాదవ్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేపాల్ అధ్యక్షురాలైన బింద్యాదేవి భండారిని కూడా కోరారు.

    అయితే ఇక్కడే అసలు ట్వీస్టు మొదలైంది. అంతవరకు కూడా నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్ బాకు మద్దతు ఇస్తామని పలికిన జనతా సమాజ్ వాదీ పార్టీ నేతలు మడత పెచీలు పెట్టారు. దేవ్ బా కాకుండా.., గతంలో ప్రధాని పదవిని చేపట్టని కొంతవారికి అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. 24 గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత కూడా ఈ మూడు పార్టీల నేతలు సయోధ్యకు రాకపోవడంతో…,  నేపాల్ రాజ్యాంగాన్ని అనుసరించి అధ్యక్షురాలైన విద్యాదేవి భండారీ సభలో అతిపెద్ద పార్టీ నేతగా ఉన్న కేపీ శర్మ ఓలీనే తిరిగి ప్రధానిగా నియమిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శుక్రవారం పీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఓలీ… నెల రోజుల్లోగా సభలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా నెల రోజుల తర్వాత ఓలీ ప్రభుత్వం సభలో తన మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైతే.. ప్రతినిధుల సభను రద్దు చేసి…తిరిగి మధ్యంతర ఎన్నికలు నిర్వహంచాల్సి ఉంటుంది.  సో నేపాల్ పిక్చర్ ఇంకా మిగిలే ఉంది.!

    Trending Stories

    Related Stories