More

    దుమ్మురేపిన దసరా మూవీ.. స్పెషల్ రివ్యూ..!

    నాని సినిమా అంటే ఫన్, కాస్త హీరోయిజం టచ్ ఉండి సాగిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ రొటీన్ కు భిన్నంగా పూర్తిగా ఊర మాస్ క్యారెక్టర్ తో ‘దసరా’ సినిమాతో వచ్చాడు. గుబురు జుట్టు, మాసిన గడ్డంతో నాని కనిపించబోతున్నాడని తెలియగానే అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ హిట్ అవుతుందని సినిమాకు ముందే నాని డిక్లేర్ చేశాడు. చిత్ర ట్రైలర్‌కు భారతదేశం అంతటా మంచి ఆదరణ లభించడంతో నాని ముంబై, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సినిమాను బాగా ప్రమోట్ చేశాడు.

    కథ విషయానికి వస్తే గోదావరిఖని ప్రాంతలోని వీర్లపల్లి అనే సింగరేణి గ్రామంలో ఉండే ధరణి, సూరి, వెన్నెల చిన్నప్పటి నుండి స్నేహితులు. వెన్నెల అంటే సూరి, ధరణిలకు చాలా ఇష్టం. సూరి ప్రేమిస్తున్నాడని తెలిసి ధరణి తన ప్రేమను చిన్నప్పుడే చంపుకుని, సూరి-వెన్నెల ప్రేమను గెలిపిస్తాడు. ఇక ఆ ఊరిలో ఉండే సిల్క్ వైన్స్ చుట్టూ కూడా కథ తిరుగుతూ ఉంటుంది. ఈ వైన్స్ ని దక్కించుకోవడం కోసం జరిగే రాజకీయాలు సినిమా నిండుగా ఉంటాయి. బొగ్గు దొంగతనం చేసే ధరణి, సూరిల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే సినిమా కథ.

    డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కారణంగా తెలుగులో ఓ రా అండ్ రియలిస్టిక్ సినిమా వచ్చిందని చెప్పుకోవచ్చు. ధరణి పాత్రలో నాని సూపర్ అనే చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం నాని ఒంటి చేత్తో నడిపించాడు. వెన్నెల క్యారెక్టర్ లో కీర్తి సురేష్ చాలా బాగా చేసింది. నాని ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన దీక్షిత్ శెట్టి అందరినీ మెప్పించాడు. సాయికుమార్, సముద్రఖని, పూర్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో.. నుండి వచ్చే సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది.

    ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా క్యారెక్టర్స్ తో వెళ్ళిపోతుంది. ప్రధాన పాత్రల మధ్య స్నేహం అన్నీ కొంచెం కొంచెం చూపిస్తూ వెళ్ళిపోయాడు. సిల్క్ బార్ చుట్టూ రాజకీయాలను బాగా చూపించారు. సినిమా సెకండాఫ్ కూడా శరవేగంగా నడుస్తుంది. నాని తన ప్రేమను చూపించే విషయం కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్‌కు ముందు, క్లైమాక్స్ సినిమాను మరో ఎత్తుకు తీసుకుని వెళుతుంది. భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ సూపర్ గా నచ్చేస్తుంది. మద్యం వ్యాపారం, గ్రామ రాజకీయాలు, సమాజంలో కులం, స్నేహం, ప్రేమ, రివెంజ్ లాంటి చాలా విషయాలను రచయిత-దర్శకుడు శ్రీకాంత్ చూపించేశాడు. అయితే కొన్ని పాత్రలకు సరైన ముగింపును ఇవ్వలేకపోయాడనే కొంచెం డిసప్పాయింట్ మాత్రం ఉంటుంది. సినిమా కెమెరా పనితనం బాగుంది. సినిమా కోసం వేసిన సెట్స్ కూడా బాగున్నాయి. సినిమా నిడివి మీద ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే చాలా బాగుండేది.

    Trending Stories

    Related Stories