More

  భారతీయ ముస్లింలకు తాలిబన్ల వార్నింగ్..!

  ప్రపంచంలోని ముస్లింలంతా ఒక్కటేనని.. ముల్లాలు, మౌల్వీలు గొంతు చించుకుని ప్రసంగాలిస్తారు. కానీ, వాళ్లు చెప్పేదానికి, చేసేదానికి పొంతన వుండదు. ముస్లిం దేశాల్లోనే ఎన్నో చీలికలు, పేలికలు. సున్నీ, షియా గొడవలు చూస్తూనేవున్నాం. ఇక, ముస్లిమేతర దేశాల్లోని ముస్లింలంటే వీరికి పడదు. అందులోనూ భారతీయ ముస్లింలంటే అస్సలు గిట్టదు. కరుడుగట్టిన ఉగ్రవాదులైతే చెప్పాల్సిన పనేలేదు. వారి అక్కసు తారాస్థాయిలో వుంటుంది. ఇటీవల తాలిబాన్ల చేతిలో ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ హత్యోదంతమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సాటి ముస్లిం అని కూడా చూడకుండా.. అతన్ని అత్యంత కిరాతకంగా హత్యచేసి.. మృతదేహాన్ని ఛిద్రం చేసి.. వాళ్లు పొందిన రాక్షసానందం.. భారతీయుల పట్ల తాలిబాన్ల క్రూరత్వాన్ని తెలియజేస్తోంది.

  డానిష్ సిద్ధిఖీ పట్ల తాలిబాన్ల క్రూరత్వం.. భారతీయ ముస్లింలకు ఒక హెచ్చరికలాంటిది. సిద్ధిఖీ 12 రౌండ్లు కాల్పులు జరిపి శరీరాన్ని ఛిద్రం చేసినప్పుడు, మృతదేహంపై జీప్ ఎక్కించి నుజ్జునుజ్జు చేస్తున్నప్పుడు కూడా ఆయనలో ఓ ముస్లిం కనిపించలేదు. కేవలం భారతీయుడే కనిపించాడు. అందుకే, అంతలా క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఇస్లాంకు బ్రాండ్ అబాసిడర్లుగా చెప్పుకునే తాలిబాన్లు.. మతపరమైన గుర్తింపుతో సంబంధం లేకుండా.. కేవలం జాతీయత ఆధారంగా డానిష్ సిద్ధిఖీ పట్ల కర్కషత్వాన్ని ప్రదర్శించారు. దీనిని బట్టి ముస్లింలలో సోదరభావం ఏమాత్రం వుందో అర్థమవుతోంది. ముస్లింలకు మత గుర్తింపే కాదు.. గ్లోబల్ ఐడెంటిటీ కూడా వుండదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

  ముస్లింలు ఏ ప్రాంతానికి చెందినవారైనా.. ఇస్లామిక్ తీవ్రవాదులు వారికి హాని తలపెట్టరని.. ఇస్లాం మౌలికవాదులు వాదిస్తూవుంటారు. కానీ, అది నిజం కాదని డానిష్ సిద్ధిఖీ హత్యోదంతం చెప్పకనే చెబుతోంది. జిహాదీ మూకలు జాతి విద్రోహశక్తులని.. వారికి ఇతర దేశాల ముస్లింల పట్ల సోదరభావం వుండదని.. తోటి ముస్లింల పట్ల వారికి ఎలాంటి జాలి, దయ ఉండదన్న నిజం తేటతెల్లమైంది. ప్రపంచాన్ని పాలించాలన్న వారి పాపపు ఎజెండా ముందు, ఈ సెంటిమెంట్లు ఏవీ పనిచేయవని మరోసారి రుజువైంది.

  ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు, తాలిబాన్లకు మధ్య జరుగుతున్న పోరును చిత్రీకరించేందుకు.. భారతీయ ఫోటో డానిష్ సిద్ధిఖీ ఆఫ్ఘన్ సాయుధ బలగాలతో కలిసి.. గత నెల 15న కాందహార్ లోని స్పిన్ బోల్డక్ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో తాలిబాన్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సిద్ధిఖీ మరణవార్తతో దేశం చలించిపోయింది. డానిష్ ను అత్యంత క్రూరంగా చంపిన తాలిబాన్లు.. మొదట్లో తాము కావాలని చంపలేదని,.. అనుకోకుండా జరిగిపోయిందని.. అతని మరణానికి క్షమాపణలు కోరుతున్నామని కపట నాటకాన్ని రక్తికట్టించారు. కానీ, అతడు భారతీయ ముస్లిం అయినందువల్లనే వెంటాడి, వేటాడి మరీ చంపేశారు.

  వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదిక ప్రకారం, తాలిబాన్లు భారతీయ ముస్లిం జర్నలిస్టును చంపడం కోసమే మొత్తం ఆపరేషన్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గత జులై 15న జరిగిన తాలిబాన్ల దాడులతో ఆఫ్ఘనిస్తాన్ బలగాలు చెల్లాచెదురయ్యాయి. డానిష్ సిద్ధిఖీ తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న గాయాలతో మరో ముగ్గురు ఆఫ్ఘన్ సైనికులతో కలిసి ఓ మసీదులో దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తాలిబాన్లు.. మసీదుపై బాంబు దాడి చేసి డానిష్‎ను దారుణంగా చంపేశారు. అంతటితో ఆగకుండా.. 12 సార్లు కాల్పులు జరిపి అతని శరీరాన్ని ఛిద్రం చేస్తారు. అప్పటికీ ఆక్రోషం చల్లారని ముష్కరులు.. డెడ్ బాడీపైకి జీపును ఎక్కించి.. తలను, ఛాతిని నుజ్జునుజ్జు చేసి రాక్షసానందాన్ని పొందారు.

  తాలిబాన్లు డానిష్ సిద్ధిఖీ పట్ల ప్రదర్శించిన పైశాచికత్వం కేవలం ముస్లిమేతరులకే కాదు.. ముస్లిం సమాజానికి కూడా కనువిప్పులాంటిది. సిద్ధిఖీ హత్యతో భారతీయుల్లో ముస్లింలు, ముస్లిమేతరులనే తేడా తమకు లేదని తాలిబాన్లు తేల్చేశారు. భారతీయుడు ఏ మతస్తుడైనా తమకు శత్రువేనని మరోసారి రుజువు చేశారు. డానిష్ విషయంలోనే కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి 100కు పైగా ముస్లిం యువకులు, యువతులు ఐసిస్ లో చేరినట్టు మన నిఘా సంస్థలు వెల్లడించాయి. వీరిలో కొంతమది సిరియా, ఆఫ్ఘనిస్తాన్‎కు వెళ్లగా.. మరికొంతమందిని మధ్య ప్రాచ్య దేశాలకు పంపించారు.

  ఇక, 2014-15 ప్రాంతంలో.. 17 మంది భారతీయులు ఐసిస్ లో చేరినట్టుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో కేరళకు చెందిన ముగ్గురు 2013-14 ప్రాంతంలో సిరియాకు వెళ్లిన వీరంతా.. మధ్య ప్రాచ్య దేశాల్లో పనిచేశారు. 2016 మే, జూన్ ప్రాంతంలో కేరళ నుంచి దాదాపు 25 మంది ఐసిస్ లో చేరేందుకు వెళ్లారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా వున్నారు. అయితే, కాలక్రమంలో వీరిలో చాలామంది ప్రాణాలతో లేరు. ఐసిస్ ముష్కరులు భారతీయు ముస్లింలనే ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తుంటారు. భారతీయ ముస్లింల విషయంలో.. ఐసిస్ వాడుకుని వదిలించుకునే పద్దతిని పాటిస్తుందని గతంలో ఎన్నో నివేదికలు తేల్చిచెప్పాయి.

  అంతేకాదు, 2014 నుంచి ఇప్పటివరకు.. మన దేశంలో పనిచేస్తున్న 177 మంది ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమిళనాడు నుంచి అత్యధికంగా 34 మంది అరెస్టయ్యారు. తమిళనాడు, కేరళ, కశ్మీర్ నుంచి ఐసిస్ లో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి చెప్పిన లెక్కల ప్రకారం.. జమాతే ఇస్లామీ సంస్థ ద్వారా కశ్మీర్ నుంచి 220 మంది ఐసిస్ లో చేరినట్టు తెలుస్తోంది.

  అయితే, వీరంతా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరినంతా మాత్రాన.. వీరి ఇండియన్ ఐడెంటిటీ మాత్రం కోల్పోవడం లేదు. అది సౌదీ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. సిరియా కావచ్చు. ఎక్కడైనా.. ఉగ్రవాద సంస్థలు వీరి ముస్లింలుగా గుర్తించడానికి ముందు.. భారతీయులుగానే పరిగణిస్తున్నాయి. అవసరానికి వాడుకుంటున్నాయి. ఈ పెడధోరణిని గుర్తించకుంటే, భవిష్యత్తులో భారతీయ ముస్లింలు ప్రమాదంలో పడినట్టే.

  Trending Stories

  Related Stories