ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాత్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి చంద్రావతి వర్మ ప్రస్తుత ఎన్నికల్లో గ్లామర్ సంచలనంగా మారింది. బాలీవుడ్ ‘ఓలే ఓలే’ పాటపై చంద్రావతి వర్మ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. హమీర్‌పూర్‌లోని రాత్ అసెంబ్లీ స్థానం నుంచి చంద్రావతి వర్మకు సమాజ్‌వాదీ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. ఆ స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గయాదిన్ అనురాగికి ఆ పార్టీ అవకాశం నిరాకరించిందిఇవ్వలేదు. ముందుగా అనురాగికి టిక్కెట్టు ఆఫర్ చేసిన పార్టీ ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే నిర్ణయం మార్చుకుని చంద్రావతి వర్మకు టిక్కెట్టు ఇవ్వడం హాట్ టాపిక్ గా మాఆరింది.
ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడిందో తెలియదు. అయితే అది పాత వీడియోనని అంటున్నారు. టిక్‌టాక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం డ్యాన్స్ వీడియో రూపొందించబడిందని తెలుస్తోంది. చంద్రావతి వర్మ ఇంతకుముందు కూడా వైరల్ వీడియోలో స్విమ్మింగ్ పూల్ వద్ద కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
చంద్రావతి గౌహంద్ బ్లాక్‌లోని ఇటౌరా గ్రామానికి చెందినవారు. ధనిరామ్ వర్మ కుమార్తె, ఆమె హైదరాబాద్‌లో జిమ్ ట్రైనర్‌గా ఉన్నారు. గౌహంద్‌లో ఆమె ప్రాథమిక పాఠశాల విద్య తర్వాత, ఉరైలోని కళాశాల నుండి పట్టభద్రురాలైంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఆమె జిమ్ ట్రైనర్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. తరువాత ఆమె తన సొంత కంపెనీని ప్రారంభించింది. చంద్రావతి వర్మ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో యాక్టివ్‌గా మారారు. ఆమె షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. హేమేంద్ర సింగ్ రాజ్‌పుత్‌తో ఆమె కులాంతర ప్రేమ-వివాహం కారణంగా డిసెంబర్ 2020లో నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. హేమేంద్ర సింగ్ రాజ్‌పుత్ జలాన్ జిల్లాలోని గోరన్ గ్రామానికి చెందినవారు.
ఇక కాంగ్రెస్ పార్టీ హస్తినాపూర్ నుండి మాజీ మిస్ బికినీ ఆఫ్ ఇండియా అర్చన గౌతమ్‌కు టికెట్ కేటాయించడం కూడా తెలిసిందే..! ఆ తర్వాత ఆమె చిత్రాలు కూడా వైరల్‌గా మారాయి.