దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలో ఓటర్లు ఎవరిని నమ్మారో తెలుసా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం కరెక్ట్ గా హుజూరాబాద్ ఎన్నికలకు ముందే ప్రారంభించారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ కు విజయాన్ని అందిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఈ పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శాలపల్లిలోని ఓటర్లు టీఆర్ఎస్కు షాకిచ్చారు. శాలపల్లిలో టీఆర్ఎస్పై బీజేపీ పై చేయి సాధించింది. శాలపల్లిలో గ్రామంలో బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీ 311 ఓట్లు పడగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు పడ్డాయి.
ఆరో రౌండ్లో బీజేపీకి 1017 ఓట్ల ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1017 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 3,639 ఓట్లు రాగా బీజేపీకి 4, 656 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్లో కాంగ్రెస్కు కేవలం 180 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరో రౌండ్ లో బీజేపీకి 1017 లీడ్ రాగా.. మొత్తం 3,186 మెజార్టీతో ఉంది.
ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4014 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,435 ఓట్లు, కాంగ్రెస్కు 132 ఓట్లు పోలయ్యాయి. ఐదో రౌండ్లో బీజేపీకి 344 లీడ్ రాగా, ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 20,158 ఓట్లు రాగా, బీజేపీకి 22,327, కాంగ్రెస్కు 811 ఓట్లు వచ్చాయి.
నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు, కాంగ్రెస్కు 234 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో బీజేపీకి 562 లీడ్ రాగా, నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల ముందంజలో ఉన్నారు.