పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి.. బైబిల్ చదవాలని ఒత్తిడి

0
1075

పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బైబిల్ చదవాలని ఒత్తిడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో దళిత సమాజంలోని మైనర్ పిల్లలను మతం మార్చాలని ఒత్తిడి చేశారు. ఆ పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి, బలవంతంగా బైబిల్ బోధించిన ఉదంతం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యాంపురానికి చెందిన సేవాధామ్ ఆశ్రమం దగ్గర చోటు చేసుకున్న ఈ ఉందంతాన్ని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తమ చేతుల్లోకి తీసుకుంది. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సాగర్‌ 48 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని కమీషన్ తెలిపింది.

సెయింట్ ఫ్రాన్సిస్ సేవాధామ్‌పై కాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సుమారు 18 నెలలుగా అక్కడ ఉంటున్న పిల్లలతో గోమాంసం తినిపిస్తూ ఉండడమే కాకుండా.. బైబిల్ చదవాల్సిందేనని వేధిస్తున్నారని తెలుస్తోంది. అన్నా చెల్లెళ్లను ఇలా వేధిస్తున్న విషయం తండ్రి దేశ్‌రాజ్‌ కు తెలియడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో, సాగర్ జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదును బాలల హక్కుల పరిరక్షణ చట్టం, 2005లోని సెక్షన్ 13 నిబంధనల ప్రకారం విచారణకు ఆదేశించామని కమీషన్ తెలిపింది.

అధికారులు మాట్లాడుతూ ‘పిల్లలు దళిత సమాజానికి (షెడ్యూల్డ్ కులం) చెందినవారు. ఫిర్యాదు మేరకు పిల్లలను బడి నుంచి బయటకు తీసుకుని వచ్చి తండ్రికి అప్పగించారు. ఇది సేవాధామ్ కాంట్ పోలీస్ స్టేషన్‌లోని బరారు ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలకు పంది మాంసం కూడా తినిపిస్తారు. సేవా ఆశ్రమంలోనే పశువులను వధిస్తారు. పిల్లలను లాకెట్ ధరించి చర్చికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు చిన్నారులు ఇందుకు నిరాకరించినందుకు వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి’ అని తెలిపారు. చాలా రోజుల వరకూ పిల్లలు సైలెంట్ గా ఉన్నారని, ఇలాంటి విషయాలు బయటకు రాకుండా చేయడానికి పిల్లలను బెదిరిస్తూ వస్తున్నారని తేలింది. ఎట్టకేలకు తాజాగా ఇద్దరు పిల్లలు అక్కడ జరుగుతున్న దారుణాలను బయట పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను అక్కడ చదువు చెప్పిస్తామని చేర్చుకుని, మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది.