More

  సైరస్ మిస్త్రీ మరణం తర్వాత కీలక వ్యాఖ్యలు చేసిన ఆనంద్ మహీంద్రా

  టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) ముంబైలోని పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాల్గర్ సమీపంలోని చరోటి దగ్గర సైరన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. కాగా పాల్ఘర్‌ దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోయినప్పటికి చాలా స్పీడ్‌గా కారును డ్రైవ్‌ చేశాడని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నారు. సైరస్ తో పాటు మరొకరు కూడా ఈ యాక్సిడెంట్ లో మృతిచెందారు.

  ప్రముఖ వ్యాపార దిగ్గజం షాపూర్‌ జి పల్లోంజి కుమారుడు సైరస్‌ మిస్ట్రీ. 1968 జులై 4న ఆయన ముంబైలో జన్మించారు. ముంబైలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న సైరస్‌ మిస్త్రీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లో ఉన్నత చదువులు కొనసాగించారు. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అనే సమయంలో మిస్త్రీ ఎంపికయ్యారు. అలా టాటా గ్రూప్ 6వ ఛైర్మన్‌గా 2012 డిసెంబర్ 28 న బాధ్యతలు చేపట్టారు. అలా 2012-16 మధ్య టాటా గ్రూప్ చైర్మన్ గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత రతన్ టాటాతో విభేదాల కారణంగా ఆయన్ను బయటకు పంపించారు. ప్రస్తుతం షాపూర్ జి, పల్లోంజి సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారు. సైరస్ తండ్రి, వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ (93) ఈ ఏడాది జూన్ 28న కన్నుమూశారు. ఇప్పుడు సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు.

  ప్రాథమిక దర్యాప్తులో ప్రమాద సమయంలో కారు చాలా వేగంగా ప్రయాణిస్తోందని తెలిసింది. వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. కారు వెనుక సీట్లో కూర్చున్నా సరే సీట్ బెల్టు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానని.. మీరందరూ కూడా వెనుక సీట్లో ఉన్నప్పుడు కూడా సీటు బెల్టు పెట్టుకుంటామనే ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పారు.

  spot_img

  Trending Stories

  Related Stories