Telugu States

సైక్లోన్ గులాబ్.. భారీ వర్షం కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్ కు భారత వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అది తీవ్ర వాయుగుండంగా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దాని ప్రభావంతో ఏపీలోని ఉత్తర తీర ప్రాంతంతో పాటు ఒడిశా దక్షిణ ప్రాంతాలపై తుపాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దానికి సైక్లోన్ గులాబ్ గా నామకరణం చేశారు. తుపానుతో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం నాటికి తీవ్రవాయుగుండం వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, ఒడిశాతో పాటు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలోనూ భారీ వర్షాలు కురుస్తాయి.. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఆ గాలుల వేగం రేపటికి 75 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించింది.

తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు అన్నారు. పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర (విశాఖ)- దక్షిణ ఒడిశా(గోపాల్ పూర్) మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

Related Articles

Back to top button