డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి

0
757

ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ప్రజలను మోసం చేయడానికి ఒక్కొక్కరు.. ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఈ సారి ఏకంగా తెలంగాణ డీజీపీ పేరు, ఫొటో కూడా వాడుకుని మోసాలకు పాల్పడ్డారు. 97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టిన కేటుగాళ్లు కొందరిని డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులులు కూడా ఉన్నారు. సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో మెసేజ్లు వెళ్లినట్లు తెలుస్తోంది. డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైం విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

మహేందర్ రెడ్డి డీపీ పెట్టి సామాన్యులకు మెసేజ్ లు పంపుతున్నారు. ప్రముఖులకు కూడా ఈ నెంబరుతో మెసేజ్ లు వస్తుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకుని ప్రజలు ఎవరూ వారి వలలో పడవద్దని పోలీసులు సూచించారు. ఈ మెసేజ్ లు పంపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.