National

బేస్ క్యాంప్ నుంచి ఇంటికెళ్లే జవాన్లకు హెలికాఫ్టర్ సౌకర్యం

మారుతున్న కాలానికి అనుగుణంగా..,  ఎప్పటికప్పుడూ మనల్ని మనం రెడీ చేసుకోవాలి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో పాక్ ప్రేరిత ఉగ్రమూకలు రూటు మార్చాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ భద్రత బలగాలే లక్ష్యంగా… ఈ ఉగ్రమూకలు తమ వ్యూహాలను ఎప్పటికప్పుడూ మార్చుకుంటున్నాయి. భద్రతదళాల కంటే కూడా టెక్నాలజీని వాడుకుని దాడులకు తెగబడటంలో ఉగ్రమూకలే ఒకింత ముందే ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్ పై పాక్ ప్రేరిత ఉగ్రమూకలు జరిపిన కారుబాంబు దాడి ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన విషయం అందరికి తెలిసిందే. దీంతో  మారుతున్న పరిస్థితలుకు అనుగుణంగా భద్రత దళాల వ్యూహారచనల్లో మార్పు అనివార్యం అయ్యింది. మళ్లీ పుల్వామా తరహా ఉగ్రదాడులు జరగకుండా…మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కశ్మీర్ లో విధులు నిర్వహించి… సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్ఫీఎఫ్ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిజానికి ఈ అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉందని…ఇప్పుడు మోదీ సర్కార్ దీనికి ఆమోదం తెలిపిందని రక్షణ రంగ విశ్లేషకులు అంటున్నారు. తాజా ప్రకటన ప్రకారం… జవాన్లు, అధికారులు… తమ ప్రయాణాల కోసం ఇకపై వారంలో మూడుసార్లు బీఎస్ఎప్ కు చెందిన 17 హిలికాప్టర్ ను ఉపయోగించుకోవచ్చు. వీరికి హెలికాప్టర్ అందుబాటులో ఉంటుంది. జవాన్లు తాము పనిచేసే బేస్ క్యాంప్ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్, జమ్మూ, విమానాశ్రయాల వరకు చేరుకునే వీలు కలగుతుంది. 

ఉగ్రదాడులతోపాటు ఐఈడీ పేలుళ్ళ నుంచి జవాన్లకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జవాన్లు రోడ్డు మార్గంలో తమ వాహనాశ్రేణి నుంచి వెళ్లే సమయంలో ఉగ్రవాదుల ముప్పు పొంచివుందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

https://youtube.com/watch?v=a4kE7RY7_9s

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × two =

Back to top button