More

    బడిలో గుడ్లను ఎత్తుకెళ్లిన కాకులు..ఆగ్రహంలో ఎమ్మెల్యే..!

    నెల్లూరుజిల్లా: కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన… వేగూరు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయానికి పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే… ప్రభుత్వం అందిస్తున్న మెనూ సక్రమంగా అమలౌతుందా అని ఆరాతీశారు. విద్యార్థులకు గుడ్డు అందుతోందా అని అడగడంతో… విద్యార్థులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన వంటపాత్రలు పరిశీలించి అక్కడున్న గుడ్లు లెక్కపెట్టించారు. విద్యార్థులు 150 మంది ఉండగా గుడ్లు మాత్రం 115 ఉన్నాయి. మిగతా 35 గుడ్లు ఏమయ్యాయని అడగ్గా… కాకులు ఎత్తుకెళ్లాయని సమాధానమిచ్చారు వంట చేస్తున్న మహిళ.దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories