National

గ్రామంలో మొసలి తిరుగుతూ ఉండగా..!

జూలై 1, గురువారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కోగిలబన్న గ్రామ వీధుల్లో ఒక మొసలి కనిపించడంతో గ్రామస్థులందరూ షాకయ్యారు. ఆ మొసలి ఎంతో స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతూ ఉండడం చూసి గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దండేలి పట్టణంలోని కాళీ నది నుండి ఈ మొసలి బయటకు వచ్చినట్లు అధికారులు చెప్పారు. నది గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికులు అధికారులకు తెలియజేయడంతో, వారు పట్టుకుని నదిలోకి విడిచిపెట్టారు.

ఒక వ్యక్తి ఉదయం 7 గంటలకు గ్రామంలో మొసలిని గుర్తించాడు. వీడియోలో చూసినట్లుగా, మొసలి గ్రామ వీధుల్లో తిరుగుతూ కనిపించింది. స్థానికులు, పిల్లలు దానిని కొంత దూరంలో అనుసరించారు. వీధుల్లో ఇరువైపులా ఇళ్ళు చూడవచ్చు. సంఘటన యొక్క విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. “ఇది నది నుండి వచ్చింది. వీధుల్లో అరగంట పాటు నడిచింది. మా అందరికీ ఆశ్చర్యం కలిగింది, కాని మేము కొంత దూరంలో ఉండి అటవీ శాఖకు ఉదయం 7.30 గంటలకు సమాచారం ఇచ్చాము ” అని స్థానిక నివాసి సుధీర్ మీడియాతో చెప్పారు. ఈ మొసలి వల్ల ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని తెలుస్తోంది.

సుమారు 45 నిమిషాల తరువాత మొసలిని పట్టుకుని తిరిగి నది లోకి విడిచిపెట్టడంలో అటవీ శాఖ అధికారులు విజయవంతమయ్యారు. “కాళీ నది గ్రామానికి ఆనుకొని ఉంది, ఆ ప్రాంతం మొసళ్ళ నివాసం. చుట్టుపక్కల ప్రాంతంలో మొసళ్లు గుడ్లు పెడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి వీధుల్లో కనిపిస్తూ ఉంటాయని”అని దండేలి డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌ఓ) రాముగౌడ తెలిపారు. గతంలో కూడా మొసళ్లు నివాస ప్రాంతాలలోకి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఒక మొసలి అదే గ్రామంలోకి ప్రవేశించి మేకపై దాడి చేసింది. అటవీ అధికారులు మొసలిని పట్టుకుని .. మేక యజమానికి పరిహారం కూడా ఇచ్చారు. సరీసృపాలు ప్రమాదకరం కాదని.. కొన్ని సార్లు మాత్రమే అవి దాడులు చేస్తూ ఉంటాయని నిపుణులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

6 + eight =

Back to top button