More

    క్రిటిక్ కత్తి మహేష్ మృతి

    సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ నేడు మరణించాడు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ముందు వెళ్తున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహేశ్ ను హుటాహుటిన నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతా చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. అయినా కూడా కత్తి మహేష్ ప్రాణాలు నిలబడలేదు.

    గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరగడంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. కత్తి మహేష్‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది.

    ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొనడంతో కొంత పాపులారిటీ వచ్చింది. ఎన్నో వివాదాలలో కూడా కత్తి మహేష్ భాగమయ్యాడు. శ్రీరాముడి గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్.

    Related Stories