More

    బాటిల్స్ తీసి పక్కన పెట్టాడు.. కోకా కోలా కంపెనీకి 4 బిలియన్ల డాలర్లు నష్టం

    క్రిస్టియానో రొనాల్డో.. యూరో కప్ లో పోర్చుగల్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఫుట్ బాల్ ప్లేయర్. అతడు దేనికైనా బ్రాండింగ్ ఇచ్చాడంటే.. ఆ ప్రోడక్ట్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ అనుకోకుండా అతడు చేసిన ఓ పనికి కోకా కోలా సంస్థ భారీగా నష్టపోయింది. తమ మొదటి మ్యాచ్ కు ముందు ప్రెస్ మీట్ లో రొనాల్డో చేసిన పనికి కోకా కోలా కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

    యూరో కప్ 2021లో భాగంగా మంగళవారం పోర్చుగల్, హంగేరీ మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మీడియా సమావేశానికి వచ్చాడు. ఆ సమావేశానికి వచ్చి కూర్చున్న రొనాల్డో టేబుల్ మీద కోకాకోలా (Coca Cola) బాటిల్స్ ఉండటం గమనించి.. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టేశాడు. వాటర్ బాటిల్‌ను పట్టుకొని ‘నీళ్లు తాగండి’ అంటూ అందరికీ చూపించాడు.

    రొనాల్డో చేసిన ఈ పనికి కోకా కోలా సంస్థ భారీగా నష్టపోయింది. క్రిస్టియానో ​​రొనాల్డో కోకాకోలా బాటిళ్లను తొలగించిన తరువాత, కంపెనీ మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్లు తగ్గించబడింది. కోకా కోలా స్టాక్ ప్రెస్ మీద భారీగా ప్రభావం చూపించింది. ఏకంగా 4 బిలియన్ డాలర్లను కోకా కోలా సంస్థ నష్టపోయింది. కోకాకోలా స్టాక్ ధర 1.6 శాతం పడిపోయింది. అమెరికన్ కంపెనీ విలువ 242 బిలియన్ డాలర్ల నుండి 238 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 4 బిలియన్ డాలర్ల నష్టం. ఇంత మెత్తంలో నష్టం చేకూరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. యూరో కప్ టోర్నమెంట్ అధికారిక మద్యపానరహిత పానీయంగా కోకా కోలా స్పాన్సర్ గా వ్యవహరిస్తూ ఉంది. నిర్వాహకులు UEFA తో 2019 లో సంతకం చేసిన స్పాన్సర్షిప్ ఒప్పందం, యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా గ్లోబల్ పానీయాల దిగ్గజం తన బ్రాండ్‌లను ప్రదర్శించే అవకాశం ఉంది. కానీ రొనాల్డో ఊహించని విధంగా కోకాకోలా బాటిల్స్ ను పక్కన పెట్టేశాడు. రొనాల్డో గతంలో కూడా కార్బోనేటేడ్ పానీయాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. “అప్పుడప్పుడు నా కొడుకు కోకాకోలా లేదా ఫాంటా తాగుతాడు. క్రిస్ప్స్ తింటాడు నాకు అది ఇష్టం లేదని అతనికి తెలుసు” అని రొనాల్డో గతంలో చెప్పుకొచ్చాడు.

    ఇక ఆట పరంగా కూడా రొనాల్డో తన సత్తా చాటాడు. మొదట్లో హంగేరి బాగా పోరాడింది. పోర్చుగల్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నిలిచింది. కానీ ఆఖరి 10 నిమిషాల్లో హంగేరికి వరుస షాక్ లు తగిలాయి. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0 తేడాతో హంగేరీపై విజయం సాధించింది. 83 నిమిషాల పాటు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే 84వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు రాఫెల్ గురియో గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యత అందించాడు. ఆ తర్వాత 87వ నిమిషంలో రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. మళ్లీ రొనాల్డోనే ఆఖరి నిమిషంలో మరో గోల్ చేయడంతో పోర్చుగల్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రొనాల్డో రెండు గోల్స్ చేయడంతో యురోపియన్ ఛాంపియన్‌‌షిప్స్‌లో ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్‌(11 గోల్స్)గా నిలిచాడు. 2016లో జరిగిన యూరోకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ని ఓడించిన పోర్చుగల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగిన పోర్చుగల్ ఎట్టకేలకు అంచనాల్ని అందుకుంది. గ్రూప్-ఎఫ్‌లో పోర్చుగల్‌తో పాటు ఈసారి జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ ఉన్నాయి. ఈ గ్రూప్ నుండి ఎవరు తర్వాతి లెవల్ కు వెళ్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

    ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో పోర్చుగల్ తరఫున 106 గోల్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఫుట్‌బాల్ చరిత్రలో ఐదు యురోపియన్ ఛాంపియన్స్‌ ఆడిన తొలి ప్లేయర్‌గానూ రొనాల్డో నిలిచాడు. గత 43 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో రొనాల్డో 45 గోల్స్ చేశాడు. ఇక ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ప్రస్తుతం ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి 109 గోల్స్‌తో ఉండగా.. రొనాల్డో ఈ రికార్డ్‌కి మూడు గోల్స్ దూరంలో ఉన్నాడు.

    https://twitter.com/TimelineCR7/status/1404881984749326336

    Trending Stories

    Related Stories