ప్రజల చేతుల్లోకి ఆయుధాలను ఇచ్చి పెద్ద తప్పే చేసిన ఉక్రెయిన్

0
758

రష్యాను ఎదుర్కోడానికి ఉక్రెయిన్ సాధారణ ప్రజలకు కూడా ఆయుధాలను అందించిన సంగతి తెలిసిందే..! అయితే అందరూ రష్యా మీద పోరాడడానికి ఆ ఆయుధాలను ఉపయోగించడం లేదు.. కొందరు తమ స్వార్థం కోసం వాటిని లూటీలు చేయడానికి, అత్యాచారాలకు పాల్పడడానికి వినియోగిస్తూ ఉన్నారు. ఉక్రెయిన్‌లో క్షీణిస్తున్న పరిస్థితుల మధ్య సాయుధ ఉక్రెయిన్లు బహిరంగంగా దోచుకోవడం, ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో రష్యా బలగాలను ఎదుర్కోవడానికి ఉక్రేనియన్ ప్రభుత్వం ఆయుధాలను ఇవ్వగా.. కొందరు నేరస్థులు అత్యాచారాలు, హత్యలు, దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యుఎస్ ఆధారిత విదేశాంగ-విధాన విశ్లేషకుడు క్లింట్ ఎర్లిచ్ బుధవారం ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. రష్యా దళాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న పౌరులందరికీ ఆయుధాలు ఇస్తామని ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్‌లోని నేరస్థులు మిలిటరీ-గ్రేడ్ ఆయుధాలను కలిగి ఉన్నారు. చాలా మంది నేరస్థుల వద్ద మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉన్నాయని దీని కారణంగా దోపిడీలు, అత్యాచారాలు, అన్ని రకాల విధ్వంసాలు జరిగాయని వైరల్ వీడియోలో చెబుతున్నారు. కీవ్‌లో జరిగిన చాలా దాడులకు రష్యన్‌లతో ఎలాంటి సంబంధం లేదని వైరల్ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతానికి రష్యన్లు 10 కి.మీ దూరంలో ఉన్నారు. అంతేకాకుండా గ్యాంగ్ వార్ కూడా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి.

ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ఆధిపత్య పోరులో క్రిమినల్ ముఠాలు తమ కొత్త ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. సాయుధ నేరస్థులు ముందుగా తమ సమస్యలను పరిష్కరించుకుని, ఆపై పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. రష్యన్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తులమని చెబుతూ ఉక్రెయిన్‌లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది అసంబద్ధం, బాధ్యతారాహిత్యమే కాకుండా ఉక్రేనియన్ ప్రజలను బాధపెడుతుంది. సైనిక అనుభవం ఉన్న ఖైదీలు రష్యా బలగాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉంటే వారిని విడుదల చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వీడియో వచ్చింది. రష్యా వైమానిక దాడులు, బాంబులు ఉక్రేనియన్ సైనిక స్థావరాలను ముంచెత్తడంతో అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ దేశాన్ని రక్షించడానికి ఆయుధాలను చేపట్టాలని పౌరులను కోరారు. పోరాడాలని కోరుకునే ఎవరికైనా ఆయుధాలను అందజేస్తామని ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు.