More

    రఘురామపై క్రిమినల్‌ కేసు పెట్టిన తెలంగాణ పోలీసులు

    ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఇటీవల తనపై హత్యా యత్నం జరగబోతోందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు తిగుగుతున్నారని.. చంపడానికి ప్లాన్ చేశారని చెప్పారు. అయితే ఇక్కడొక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను కిడ్నాప్‌ చేసి, తీవ్రంగా హింసించారు. దీంతో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా (ఎ1గా) ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏ 2గా ఆయన కుమారుడు భరత్, ఏ 3 గా సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.సందీప్‌ సాధు, ఏ 4 గా సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై కె. గంగారామ్, ఏ 5గా ఎంపీ పీఏ శాస్త్రి.. మరికొందరిపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ 365, 332, 384, 323, 324, 342, 504, 506, 294(బి) రెడ్‌ విత్‌ 34, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ షేక్‌ ఫరూక్‌ బాషా విధులకు ఆటంకం కలిగించడం, కిడ్నాప్‌ చేసి నిర్బంధించడం, దాడి చేసి బెదిరించడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories