క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘జాన్ సే’ !

0
648
Crime Thriller darama 'Jaanse'
Crime Thriller darama 'Jaanse'

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా ‘జాన్ సే’ టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో రూపొందిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’ లో యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేసే ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో పూర్తి షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అప్ కమింగ్ హీరో హీరోయిన్లతో, రూ 10 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ సీనియర్ నటీనటులతో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా లావిష్ గా తెరకెక్కిస్తున్నారు. ‘జాన్ సే’ చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు: అంకిత్, తన్వి, సుమన్, అజయ్, తనికెళ్ళ భరణి, సూర్య, భాస్కర్, రవి వర్మ, అయేషా, రవి శంకర్, లీల, బెనర్జీ, రవి గణేష్, రమణి చౌదరి, వంశీ, అంజలి, కిరణ్ కుమార్, ఏ కే శ్రీదేవి, ప్రశాంత్ సమలం, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ్
సాంకేతిక నిపుణులు: కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : ఎస్. కిరణ్ కుమార్, సంగీత దర్శకుడు : సచిన్ కమల్, ఎడిటర్ : ఎం ఆర్ వర్మ, లిరిక్స్ – విశ్వనాథ్ కరసాల, డి ఓ పి:మోహన్ చారీ, డైలాగ్స్ : పి మదన్, పి ఆర్ ఓ – బి ఏ రాజు ‘s టీం, పబ్లిసిటీ డిజైన్స్ : ఏ జె ఆర్ట్స్ (అజయ్)

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × 2 =