Sports

తన దేశాన్ని రక్షించమని వేడుకుంటున్న క్రికెటర్ రషీద్ ఖాన్

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో అనేక మంది దేశం నుండి పారిపోవలసి వచ్చింది. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజలను అయోమయంలో ఉంచవద్దని, ప్రపంచ నాయకులు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. “ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశం గందరగోళంలో ఉంది, పిల్లలు మహిళలు సహా వేలాది మంది అమాయకులు, ప్రతిరోజూ మరణిస్తూ ఉన్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. మమ్మల్ని గందరగోళంలో ఉంచవద్దు. ఆఫ్ఘన్‌లను చంపడం మరియు ఆఫ్ఘనిస్తాన్‌ను నాశనం చేయడం ఆపండి. మాకు శాంతి కావాలి “అని ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దాడులలో ఎంతో మంది అమాయకులు బలవుతూ ఉన్నారు. ఆ దేశంలో ఉండడం సురక్షితం కాదని ఇప్పటికే చాలా దేశాలు ఆయా దేశాల ప్రజలకు, దౌత్య వేత్తలకు సూచించాయి. తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా వెళ్లిపోయే రోజులు ఏమంత దూరంలో లేవని తెలుస్తోంది.

భారతీయుల్లారా ఆఫ్ఘన్ ను వీడండి:

ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్ లో హింస ఇలాగే కొనసాగుతూ ఉంటే.. త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆ లోపే భారత పౌరులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అనేక ప్రావిన్సులు, నగరాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేస్తున్నారని.. ఆఫ్ఘనిస్తాన్‌ లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులెవరైనా ఉంటే స్వదేశానికి వెళ్లే విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని తెలిపింది. విమాన సర్వీసులు నిలిచిపోకముందే భారత్ కు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఆఫ్ఘన్ లో భారత దౌత్యకార్యాలయం ప్రకటనలో ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + six =

Back to top button