ప్లాట్లను రిజిస్టర్ చేసుకోండి: అమరావతి రైతులకు సీఆర్డీఏ ఆహ్వానం

0
883

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి 34,385 ఎకరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం ప్రకారం నివాస, వాణిజ్య తరహాలో ప్లాట్లను అభివృద్ధి చేసి తిరిగివ్వాల్సి ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే 40,378 ప్లాట్లను రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రకియకు మార్చి నెలాఖరు వరకు గడువు విధించారు. అప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారి కోసం మరోసారి గడవును పొడిగించారు. తాజాగా తమ ప్లాట్లను రిజిస్టర్ చేసుకునేందుకు రావాలంటూ అమరావతి రైతులకు సీఆర్డీఏ ఆహ్వానం పలికింది. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, రైతులు వెంటనే స్పందించి తమ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు ఇచ్చారు.