More

    కాంగ్రెస్ కు కౌంటర్లు వేస్తూ.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ నోట పుష్ప డైలాగ్

    అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగులను పలు సెలెబ్రిటీలు కూడా వాడేశారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు కూడా ఈ డైలాగులను వాడుతున్నారు. అది కూడా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నోట ‘పుష్ప’ డైలాగులు రావడం విశేషం. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ ‘పుష్ప’ సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు. అందరూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని ఆ సినిమా పేరు ‘పుష్ప’ అని రాజ్ నాథ్ చెప్పారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు. ఈయన చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని ఈయనలో కూడా ఫ్లవర్ ఉంది, ఫైర్ ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని ఈయన తగ్గేదేలే అని చెప్పుకొచ్చారు.

    ఉత్తరాఖండ్‌లోని గంగోలిహాట్‌లో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, పుష్ప సినిమా డైలాగ్‌ను సీఎం పుష్కర్ సింగ్ ధామికి కనెక్ట్ చేస్తూ విభిన్నంగా మాట్లాడారు. మన ముఖ్యమంత్రి పేరు పుష్కర్ అని, అయితే ఈ పుష్కర్ పేరు వింటేనే పువ్వు అని కాంగ్రెసోళ్లకు అర్థమవుతోందని.. అయితే ఈ పుష్కర్ కూడా ఒక పువ్వు మాత్రమే కాదు అగ్ని కూడా అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మా పుష్కర్ ఎప్పటికీ తలవంచడు, ఆగడు అని అన్నారు.

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు, “కాంగ్రెస్‌కు ఎటువంటి విధానం లేదు.. వారికి ఎటువంటి స్థిరత్వం లేదు.. అభివృద్ధి చేయడంపై విశ్వాసం లేదు.. కాంగ్రెస్ ఎప్పుడూ దోచుకుంటూ ఉంటుంది. దేశం, రాష్ట్రం.. ఉత్తరాఖండ్‌ను ఇక తలవంచనివ్వబోం.. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే.. సీఎంను కూడా ప్రకటించే పరిస్థితి లేదు, అందుకే ఏ నాయకుడిని ప్రకటించలేదు” అని ఆయన విమర్శించారు.

    Trending Stories

    Related Stories