More

    టపాసులు కాలిస్తే అరెస్టు చేస్తాం

    దీపావళికి ముందు ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరం అంతటా రద్దీగా ఉండే అనేక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు ఔటర్ ఢిల్లీ డీసీపీ పర్వీందర్ సింగ్ చెప్పారు. భద్రతా ఏర్పాట్లను వివరించిన ఆయన.. ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా నిషేధం కారణంగా, వాటిని అమ్మినా లేదా కాల్చినా కేసులు నమోదు చేస్తామని పర్వీందర్ సింగ్ తెలిపారు.

    పండుగకు ముందు కేజ్రీవాల్ ప్రభుత్వం జనవరి 1, 2022 వరకు అన్ని రకాల టపాసుల అమ్మకం మరియు పేల్చడంపై పూర్తి నిషేధాన్ని విధించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ పండుగ సీజన్‌లో టపాసుల అమ్మకంపై అణిచివేత ప్రారంభించారు. దీపావళికి కొన్ని వారాల ముందు తీసుకున్న నిర్ణయం టపాసుల తయారీదారులు మరియు వ్యాపారుల జీవితాలను నాశనం చేసింది. దీపావళి సందర్భంగా పటాకులను మళ్లీ నిషేధించడంపై ఢిల్లీ బాణాసంచా వ్యాపారులు కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

    ఢిల్లీలోని సదర్ బజార్‌లోని ఫైర్‌క్రాకర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్జీత్ సింగ్ చబ్బ్రా స్థానిక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “దీపావళిని భారతదేశంలో జరుపుకోకపోతే, పాకిస్తాన్‌లో జరుపుకోవాలని భావిస్తున్నారా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వం క్రాకర్ల తయారీని నిషేధిస్తే.. మేము అమ్మడం కూడా మానేస్తాం.. సుప్రీం కోర్టు నుండి ఆర్డర్ పొందడం ద్వారా వారు గ్రీన్ క్రాకర్స్ తయారు చేసేలా చేశారు. ఇప్పుడు వారు వాటిపై కూడా నిషేధం విధించారని విచారణ వ్యక్తం చేశారు.

    ఢిల్లీ మాత్రమే కాకుండా ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా టపాసుల అమ్మకాలపై నిషేధం విధించాయి. దేశంలో 90 శాతానికి పైగా టపాసులు ఉత్పత్తి చేసే ప్రాంతం తమిళనాడులోని శివకాశి. పలు రాష్ట్రాల్లో నిషేధం కారణంగా ఈ ఏడాది దాదాపు రూ.500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు.

    Trending Stories

    Related Stories