అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా శ్రేణులు రాజమండ్రి శ్యామలసెంటర్ వద్ద ఘనస్వాగతం పలికారు. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. శ్యామల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్, వి.టి కాలేజ్ రోడ్ మీదుగా స్టేడియం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు జరిగే పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ వినాదాలు చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులివ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు ప్రజల నుండి వస్తున్న మద్దతు ఓర్వలేకే దాడి చేశారని ఆరోపించారు.