More

    సీపీఐ నారాయణ సతీమణి వసుమతి కన్నుమూత

    సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతి కన్నుమూశారు. వసుమతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వసుమతి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని ఐనంబాకం వద్ద నిర్వహించనున్నారు.

    వసుమతి గతంలో బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేశారు. ఆమెకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు మూడ్రోజుల కిందట స్టెంట్ అమర్చారు. వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. నారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు నారాయణను ఓదారుస్తూ ఉన్నారు. వసుమతి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    Trending Stories

    Related Stories