More

    సీపీఐ నారాయణను అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు

    కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను ఫ్లోరిడా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పార్టీ సమావేశాల అనంతరం క్యూబా రాజధాని హవానా నుంచి పెరూ వెళ్తూ మార్గమధ్యంలో ఫ్లోరిడాలో నారాయణ ఆగారు. అక్కడ ఆయనను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నారాయణ వద్ద అమెరికా వీసా ఉన్నప్పటికీ ముందుకెళ్లకుండా విచారణ నిమిత్తం ఆపివేశారు.

    భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి క్యూబాలోని హవానా విమానాశ్రయం నుంచి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరవడానికి వెళ్లిన నారాయణ… అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో ఫోటో దిగారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది… ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపారు. అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుని వదిలేసినట్టు నారాయణ తెలిపారు.

    Trending Stories

    Related Stories