More

    బీజేపీ-వైసీపీ మధ్య బంధం ఎంత బలంగా ఉందో ఇది ఒక ఉదాహరణ: సీపీఐ నారాయణ

    వైసీపీ-బీజేపీ బంధం విడదీయలేనిదని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం స్వాగతించారని.. దీనిని బట్టి బీజేపీ-వైసీపీ మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నారని.. తక్షణమే ఆ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రైవేటు విమానాలపై నియంత్రణ, నిఘా లేకపోవడం వల్ల వాటి ద్వారా కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును రవాణా చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో రూ. 700 కోట్లు వినియోగించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. దేశంలో టెర్రరిజాన్ని నియంత్రించలేని వ్యక్తి అంతర్జాతీయ సదస్సులో టెర్రరిజం గురించి మాట్లాడడం సిగ్గుచేటని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు నారాయణ.

    Trending Stories

    Related Stories