National

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన సిపిఐ నేత.. తీగ లాగితే

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేత, పార్టీ సోషల్ మీడియా సెల్ సభ్యుడు అర్జున్ అయంకి బంగారు అక్రమ రవాణా కేసులో ప్రమేయం ఉన్నందుకు కేరళ కొచ్చిలో కస్టమ్స్ విభాగం అరెస్టు చేసింది. కరిపూర్‌లోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల చోటు చేసుకున్న బంగారు అక్రమ రవాణా ప్రయత్నంలో కమ్యూనిస్టు నాయకుడు అర్జున్ అయంకి ప్రధాన నిందితుడు కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుండి కోజికోడ్ కు 2.23 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ యువజన విభాగం నేత డివైఎఫ్ఐ కన్నూర్ యూనిట్ మాజీ కార్యదర్శి అయిన సిపిఐ (ఎం) సోషల్ మీడియా ప్రచారకుడు అర్జున్ అయంకిని కస్టమ్స్ విభాగం అరెస్ట్ చేసింది.

జూన్ 21 న కోజికోడ్‌లోని కరీపూర్ విమానాశ్రయం నుంచి మలప్పురంలో నివసించే మొహమ్మద్ షఫీక్ మెలేతిల్ నుంచి 2.33 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు, కోజికోడ్ జిల్లాలోని రామనట్టుకరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ఐదుగురు యువకులు మరో ప్రత్యర్థి స్మగ్లింగ్ ముఠాను వెంబడించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. మొహమ్మద్ షఫీక్ చేత స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన బంగారం ఇతరుల వద్ద ఉందని భావించి ఈ ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నిందితుడు మహ్మద్ షఫీక్‌ను అరెస్టు చేసినట్లు మరణించిన యువకులకు తెలియదు. సిపిఐ (ఎం) నాయకుడు అర్జున్ అయంకికి నిందితుడు మహ్మద్ షఫీక్‌తో సంబంధాలున్నాయని కస్టమ్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. స్మగ్లింగ్ చేయబడిన బంగారం కోసం కరీపూర్ విమానాశ్రయం బయట అర్జున్ ఎదురు చూసినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అర్జున్ స్మగ్లింగ్ రాకెట్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. మొహమ్మద్ షఫీక్ నుండి స్మగ్లింగ్ బంగారాన్ని తీసుకోడానికి కోజికోడ్ విమానాశ్రయానికి వెళ్ళాడని పోలీసులు తెలిపారు.

స్మగ్లింగ్ కుంభకోణంలో సిపిఐ నేతలు

ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన ఘటనల్లో సిపిఐ నేతల పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో సిపిఐ (ఎం) నాయకుడిని అరెస్టు చేయడం పార్టీకి, ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పెద్ద ఇబ్బంది కలిగించే అంశం. ఎందుకంటే ప్రాథమిక దర్యాప్తులో కన్నూర్‌లోని మరికొందరు సిపిఐ (ఎం), డివైఎఫ్‌ఐ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఎంతో మంది కుమ్మక్కై ఉన్నారని తెలుస్తోంది. అర్జున్ ఉపయోగించిన కారును డివైఎఫ్ఐ నాయకుడు సి సజేష్ ది కావడం.. అతను సిపిఐ (ఎం) నియంత్రణలో ఉన్న సహకార బ్యాంకుతో బంగారును పరీక్షించే వాడట..! మరో కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీజేష్ దాస్ పాత్ర గురించి కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్నాకుళంలోని స్థానిక కోర్టు అర్జున్ అయంకిని కస్టమ్స్ విభాగానికి ఏడు రోజుల కస్టడీ మంజూరు చేసింది. అయాంకి తెలియని ఆదాయ వనరులు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కస్టమ్స్ తెలిపింది. అతను చాలా మంది యువకులను బంగారు అక్రమ రవాణాకు ఆకర్షించినట్లు తెలుసుకున్నారు. నగరంలోని పరియారం మెడికల్ కాలేజీ హాస్పిటల్ సమీపంలో అర్జున్ ఉపయోగించిన కారును కన్నూర్ పోలీసులు ఆదివారం నాడు గుర్తించారు. బంగారం అక్రమ రవాణాకు ఈ కారు ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − eleven =

Back to top button