NH OpinionOpinion

గల్వాన్ వీరుల బలిదానాన్ని అపహాస్యం చేసిన ఇండియన్ కమ్యూనిస్టులు

కమ్యూనిస్టు చైనా దేశం… మన భారత దేశానికి మిత్ర దేశమా? లేక శత్రు దేశమా? అలాగే ఆ దేశంలోఉండే ఏకైక పార్టీ.., కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా మాత్రమే.! ఇంకా దేశాన్ని పరిపాలించే పార్టీ కూడా అదే..! కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనానే, తమ దేశాన్ని పరిపాలించే నేతలను ఏంపిక చేస్తుంది. అలాంటి కమ్యూనిస్టు చైనా.. మన భారత అభ్యున్నతిని కోరుకుంటుందా? లేక తమ చైనా దేశ అభ్యున్నతిని కోరుకుంటుందా ? అంటే ఏమని చెబుతారు.?
ఖచ్చితంగా కమ్యూనిస్టు చైనా…తన దేశ అభ్యున్నతినే కోరుకుంటుంది.! అందుకోసం పొరుగు దేశాల వనరుల దోపిడికి సైతం తెగబడుతుంది. విస్తారణవాదం ముసుగుతో ఆయా దేశాలపై దురాక్రణలకు దిగుతుంది. ఇంకా ఆ దేశాలను కమ్యూనిస్టు ఉక్కుపాదం కింద నలిపివేస్తుంది.
కమ్యూనిస్టు చైనా అంటేనే జిత్తులమారి గుంటనక్క అనే పేరుంది.! అది జరిపే దురాక్రమణ చర్యలు చూస్తుంటేనే.., ఎవరికైనా సరే.., ఇట్టే అర్థమైపోతుంది.!
కానీ ఈ విషయం మన దేశంలోని కమ్యూనిస్టులకు… ముఖ్యంగా సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఎంఎల్ గ్రూపులకు, మావోయిస్టులకు మాత్రం ఎందుకు అర్థం కావడం లేదు.? పైగా మన దేశంలో కమ్యూనిస్టులు అనగానే.., వారో గొప్ప మేధావులుగా బిల్డప్ ఇస్తుంటారు. మరి…, ఈ కమ్యూనిస్టు మేధావులు… లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు, కమ్యూనిస్టు చరిత్రకారులు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు.?
కమ్యూనిజం సిద్ధాంతంతో భూతల స్వర్గం సృష్టించవచ్చునని కమ్యూనిస్టులు నమ్మేవారు. ప్రపంచ దేశాలు కమ్యూనిజాన్ని అడాప్ట్ చేసుకుంటే అన్నింతరాలు తొలగిపోతయాని ప్రచారం చేశారు. అయితే కమ్యూనిస్టు దేశాల మధ్యనే ఐక్యత సాధ్యకాలం లేదు. రష్యా క్యమ్యూనిజం స్టయిల్ వేరు. చైనా కమ్యూనిజం స్టయిల్ వేరు. ఇంకా ఉత్తర కొరియా కమ్యూనిజం వేరు. ఈ దేశంలో పాలకుడు అనువంశిక వారసత్వం నుంచి కమ్యూనిస్టు పాలకుడుగా వస్తాడు. క్లియర్ గా చెప్పాలంటే కమ్యూనిజం పేరుతో నార్త్ కొరియాలో నడుస్తున్నది రాచరీక వ్యవస్థ. ఇక క్యూబా సంగతి సరేరి. ఒకే సిద్ధాంతాన్ని ఈ దేశాలు ఆచరిస్తున్నప్పుడు మరి ఈ దేశాల మధ్య ఇన్ని అంతరాలు ఎందుకు?
మొదట బ్రిటన్, అమెరికా వంటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలున్నా దేశాల్లో కార్మిక నియంతృత్వంతో కమ్యూనిస్టు రాజ్యాలుగా మారిపోతాయని మార్క్స్ ,ఎంగిల్స్ వంటి కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు సెలవిచ్చారు. వారి అంచనాలు.. సిద్ధాంతాలు తప్పదని తర్వాత రోజుల్లో తెలిపోయింది.
అంతేందుకు కమ్యూనిజం యూనివర్సల్ ఐడియాలజీ అంటూ దాన్ని చైనాతోపాటు, మన భారత దేశం కూడా కమ్యూనిజాన్ని ప్రేమిస్తున్నా కూడా.., మన దేశానికి వ్యతిరేకంగానే చైనా ప్రవర్తిస్తూనే ఉంటుంది అనేది నిజం. ఎందుకంటే చైనా కమ్యూనిస్టులకు తమ దేశ అభ్యున్నది ముఖ్యం. అందుకోసం ఎంత దూరమైనా ఆలోచిస్తారు. దాని చర్యలు ఎప్పుడు కూడా ఇండియాకి అగెనెస్ట్ గానే ఉంటాయనే విషయం.., చిన్న పిల్లాడికి సైతం ఇట్టే అర్థమైపోతుంది.!
ఇండియాకు శత్రు దేశాలు ఏంటి ? అనగానే మొదట పాకిస్తాన్ పేరును, ఆ వెంటనే కమ్యూనిస్టు చైనా పేరు తడుముకోకుండా చెప్పేస్తుంటారు.! మన స్కూల్ విద్యార్థులే కమ్యూనిస్టు చైనా పట్ల.., అంత క్లారిటీగా ఉంటే…, మన దేశంలోని ఈ కమ్యూనిస్టు పార్టీల నాయకులు, ఎందుకు క్లారిటీ ఉండటం లేదని ఎవరికైనా సందేహం రావొచ్చు.!

భారత్, చైనాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో, మన ఇండియన్ కమ్యూనిస్టులు పోషించే పాత్ర ఎప్పుడూ కూడా డౌట్ పుల్ గానే ఉంటుందని మనం మర్చిపోరాదు. సూటిగా సుత్తిలేకుండా చైనా మన దేశంపై దురాక్రమణ జరిపిందని.., చైనా చేస్తున్నది ముమ్మాటికి తప్పేనని భారత కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు బహిరంగంగా చెప్పవు.?
చైనా కమ్యూనిస్టు పార్టీ పే రోల్ లో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు, జర్నలిస్టులు, ఎన్జీవో సంఘాలు, పత్రికలు చాలానే ఉన్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. అందుకేనేమో తెలియదు కానీ…, కమ్యూనిస్టు పార్టీలు.., లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు, ఇండియన్ న్యూస్ పేపర్లు, చానళ్లు… భారత్, చైనాల మధ్య ఉద్రికత్తలపై., ఎప్పుడు కూడా డొంక తిరుగుడుగానే మాట్లాడుతుంటాయి. చైనాను దుష్మన్ నంబర్ వన్ గా పేర్కొనవు. పైగా చైనానే కరెక్ట్.., మనమే తప్పు చేశామనే విధంగా బాకాలుదుతాయనే పేరుంది.
తూర్పు లద్దాఖ్ లోని., గాల్వాన్ లోయలో.., భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత., మన దేశం దౌత్యపరంగా చైనా పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది. దేశంలో యువతను పెడద్రోవ పట్టిస్తోన్న ఎన్నో చైనా యాప్ లను నరేంద్రమోదీ ప్రభుత్వం నిషేధించింది.
రాత్రికి రాత్రికి దొంగతనంగా సరిహద్దు రాళ్లను మార్చేసి తిష్టవేడయం ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా మాదేనని మడత పేచీలు పెట్టడం చైనా నైజం.! అనంతరం ఇదేమిటని ఆ దేశం ప్రశ్నిస్తే., చర్చలు జరుపుకుందాం.., సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందాం, అంటూ శాంతివచనాలతో కాలయాపన చేస్తోంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అక్రమంగా ఆక్రమించుకుని కబ్జా చేసుకున్న ప్రాంతాన్ని తన కంట్రోల్ లోనే ఉంచుకుంటుంది.
గత కొన్నేళ్లుగా భారత సరిహద్దుల వద్ద కమ్యూనిస్టు చైనా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అయితే చైనా సైన్యం అనుసరిస్తోన్న ఈ విస్తరణవాద వ్యూహాన్నికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాకతో చెక్ పడింది. గాల్వాన్ లోయలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నించిన చైనా పీపుల్స్ లిబరేషన్ సైనికులను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. ఈ పోరాటంలో ఇరవై మంది వరకు భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపున నలభైమందికి పైగా సైనికులు హతం అయ్యారు. అయితే తమ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పేర్లను చైనా అధికారికంగా ఇంత వరకు బయటపెట్టలేదు. వారి ప్రాణ త్యాగానికి కనీస గుర్తింపునుకు కూడా ఇవ్వలేదు. ఇది చైనా కమ్యూనిస్టులు తన దేశ సైనికులకు ఇచ్చే గౌరవం..!
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాను..స్థాపించి వందేళ్లు పూర్తయ్యింది. దీనికి గుర్తుకుగా చైనా పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం జులై 28న భారత్ లోని చైనా రాయబార కార్యాలయంలో కూడా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించింది.
అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ జరుపుతున్న శతాబ్ది ఉత్సవాల విషయంలో భారత ప్రభుత్వం క్లియర్ స్టాండ్ తీసుకుంది. వందేళ్ళ ఉత్సవాలు జరుపుకుంటున్న చైనా కమ్యూనిస్టు పార్టీకి కానీ, ఆ దేశ ప్రభుత్వానికి కానీ.., నరేంద్రమోదీ మోదీ ప్రభుత్వం ఇంత వరకు అధికారికంగా ఎలాంటి శుభాకాంక్షలు తెలపలేదు. ఈ ఉత్సవాల విషయంలో మౌనంగా ఉంది. అదే సమయంలో చైనా బద్దవ్యతిరేకి.. టిబెట్ పాలకుడు బౌద్ధ బిక్షువు అయినా దలైలామాకు భారత ప్రభుత్వం అధికారికంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఇండియా స్టాండ్ ఏంటో మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ పాటికే అర్థం కావాలి.
సో… కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వందేళ్ళ ఉత్సవాలపై మన దేశం స్టాండ్ ఏంటో క్లియర్ గా తెలిసిన తర్వాత.., మన దేశంలోని రాజకీయ పార్టీలు ఏమి చేయాలి? దేశానికి అండగా నిలబడాలి కదా?
చైనా రాయబారా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వందేళ్ళ ఉత్సవాలకు.. చైనా రాయబారి ఆహ్వానించినా వెంటనే.., మేము రాలేము? మా దేశ సరిహద్దుల్లో వీరు వ్యవహారిస్తున్న తీరుబాగా లేదు. విస్తరణవాదంతో ఇంకా ఎన్ని సార్లు మా సరిహద్దులను రక్తసిక్తం చేస్తారు. గాల్వాన్ లోయలో భారత సైనికుల మరణానికి కారణం మీరు కాదా? అంటూ మన దేశంలోని రాజకీయ పార్టీలు ప్రశ్నల వర్షం కురిపించాలి?
కానీ ఏం చేస్తాం..,!
మన దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు తమ వక్ర బుద్దిని చూపించాయి. అవి ఏ దేశానికి విశ్వాసపాత్రులో తమ చర్యల ద్వారా చాటి చెప్పాయి. చైనా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉత్సవాలకు మన దేశంలోని సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐకి చెందిన డీ రాజా, అలాగే తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ కార్యదర్శి జి. దేవరాజన్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల సభ్యుడు జియావోలిన్ కూడా పాల్గొన్నారు. జియావోలినే ఈ సమావేశాలకు నాయకత్వం వహించాడు.
ఇక ఈ సమావేశంలో భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ ముఖ్య ఉపన్యాసం చేశారు. భారత్ కు చైనా ఎన్నో ఉపకారాలు చేసిందని, కోవిడ్ సమయంలో భారత్ కోరిన అత్యవసర మూడి సరుకులను ఇండియాకు పంపించేందుకు చైనా కార్మికులు ఓవర్ టైమ్ పనిచేశారని చెప్పుకొచ్చాడు. అలాగే గాల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముఖాముఖి ఘర్షణలను ప్రస్తావించారు. భారత్ తో సరిహద్దుల విషయంలో చైనా తన స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పిందని, అయినా భారత సైన్యమే దూకుడు ప్రదర్శించిందని, ఒకింత తప్పంతా కూడా భారత ప్రభుత్వం, భారత సైన్యందేనని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు చైనా రాయబారి.!
అయితే చైనా రాయబారి సన్ వీడాంగ్ తన ఉపన్యాసంలో భాగంగా భారత ప్రభుత్వం.., భారత సైన్యం నిందలు మోపుతున్నప్పుడు… ఆ సమావేశంలో పాల్గొన్న సీతారాం ఏచూరి కానీ, డీ. రాజా కానీ, డీఎంకే సెంథిల్ కుమార్ కానీ.., చైనా రాయబారి చేసిన వ్యాఖ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండటాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి.
ఇంటి దొంగలు అంటే ఇలాగే ఉంటారేమో? మన ఇండియన్ కమ్యూనిస్టులకు భారత దేశం పట్ల ప్రేమ లేదని, వారు చైనా పక్షపాతులని తేలిపోయింది. వారి చరిత్ర అంతా కూడా చైనాకు కొమ్ముకాయడంతోనే సరిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేందుకు మొన్నటికి మొన్న జులై 1వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా…శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వామపక్ష పత్రికగా పేరున్న ది హిందూ పత్రికకు ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది. అలాగే అదే రోజు మూడో పేజీలో కమ్యూనిస్టు చైనా ఘనకార్యాలపై ఒక పెయిడ్ అర్టికల్ ను కూడా ది హిందూ ప్రచురించింది.
ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సామన్యం జనం ఈ పెయిడ్ అర్టికల్ ను గుర్తించలేని విధంగా రెగ్యులర్ రిపోర్టు మాదిరిగానే ప్రచురించింది ది హిందూ వార్త పత్రిక యాజమాన్యం. ఆ ప్రచురించిన న్యూస్ ను లోతుగా పరిశీలిస్తేనే.., ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని రాసిన పెయిడ్ కంటెంట్ అని ఈజీగా తెలిసిపోతుంది.
అలాగే ఇంకొక విచారకరమైన విషయం ఏమిటంటే.. బెంగాల్ లో సీపీఎం మౌత్ పీస్ పత్రికగా పిలిచే గణశక్తి పత్రిక ఫ్రంట్ పేజీ కథనం గురించి మనం చెప్పుకొవాలి. గాల్వాన్ ఘర్షణలో అమరులైన భారత సైనికుల త్యాగాన్ని ఈ సీపీఎం పత్రిక అపహాస్యం చేస్తూ… మొదటి పేజీలోనే తప్పు అంతా కూడా భారత సైనికులదే అంటూ నిందించింది. భారత సైనికులే ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని ఆరోపించింది. భారత సైనికుల బలిదానంపై చైనాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చైనా ప్రభుత్వం చెప్పిన వర్షనే తమ వర్షన్ అన్నట్లుగా ఈ వార్తకథనం సాగింది.
నిజానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఈ వందేళ్ళల్లో చేయని దుర్మర్గాలు లేవు. చైనాలో ఉండేది ప్రజాస్వామ్యం కాదు.. పార్టీ నియంతృత్వం.! మావో నుంచి మొదలు పెడితే ఇప్పుడు షీ జింగ్ పింగ్ వరకు చైనా పాలకులందరు నియంతలేనని మనం మర్చిపోరాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కమ్యూనిస్టులు 110 మిలియన్ మంది ప్రజలను ఊచకోతలకు గురిచేశారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన ప్రజల కంటే కూడా కమ్యూనిస్టుల చేతిలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారనే విషయం మనం మర్చిపోరాదు.
స్వతంత్ర టిబెట్ దేశంపై దురాక్రమణ జరిపి ఆ దేశాన్ని కమ్యూనిస్టు చైనా ఆక్రమించుకుంది. ఇదేమి అన్యాయమంటూ అహింసా మార్గంలో టిబెట్ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన బౌద్ధ భిక్షువులను ఊచకోతలకు గురిచేసింది కమ్యూనిస్టు చైనా. భారత్ తో పంచశీల ఒప్పందం చేసుకుంది చైనా. ఆ తర్వాత హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూనే భారత్ ను వెన్నుపోటు పోడించింది. 1962లో మన దేశంపై దురాక్రమణకు దిగింది. మన దేశానికి చెందిన అనేక వేల చదరపు కిలోమీటర్ల భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. 1962లో భారత్, చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో గాయపడిన భారత జవాన్లకు రక్తదానం చేయడాన్ని సైతం మన దేశంలోని కమ్యూనిస్టు పార్టీ తప్పుపట్టింది.
ఇది దేశ ద్రోహం కాదా? అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీకి…మన దేశంలోని కాంగ్రెస్ పార్టీకి మధ్య అధికారికంగానే సమాచారా మార్పిడి ఒప్పందం జరిగిందని అంటారు. ఇంకా డొక్లామ్ సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాహుల్ గాంధీ చైనా రాయబారితో రహస్య మంతనాలు జరిపిన విషయం కూడా దేశ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
అటు ఉయ్ గర్ ముస్లింల హక్కుల ఉల్లంఘనలకు కూడా కమ్యూనిస్టు చైనా పాల్పడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉయ్ ఘర్ ముస్లింలను బంధించినట్లు అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. హాంకాంగ్ లో ప్రజాస్వామ్యాన్ని.. అక్కడి ప్రజల హక్కులను సైతం చైనా హరించివేస్తోంది. అలాగే అభివృద్ధి ప్రాజెక్టులను ఎరగావేసి అనేక దేశాలను అప్పుల ఊబిలోకి దింపి, ఆయా దేశాల భూభాగాలను లీజు పేరుతో ఆక్రమించుకుంటోంది. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్న మన దేశంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలను మనం ఏమానాలి? మీరే చెప్పండి.! ఇప్పటికైనా ఆ పార్టీల నేతలతో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
భారత్ మాతాకీ జై.
(మనసా వాచా కర్మణా దేశ హితం కోరే ఓ జాతీయవాది )

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 × four =

Back to top button