More

    గోవుల అక్రమ రవాణా: వి.హెచ్.పి. వాలంటీర్ మీద టెంపోతో దూసుకెళ్లిన గోవుల స్మగ్లర్లు

    గుజరాత్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అడ్డుకోడానికి ప్రయత్నించిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తను స్మగ్లర్లు దారుణంగా చంపేశారు. గోరక్షకుడి మీద టెంపో ఎక్కించి మరీ చంపేశారు. గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని హార్దిక్ కన్సరాగా గుర్తించారు. ఇంటర్ స్టేట్ గోవుల స్మగ్లింగ్ ముఠాను అడ్డుకోడానికి హార్దిక్ ప్రయత్నించాడు. వారు టెంపోలో గోవుల అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన హార్దిక్.. వారిని అడ్డుకోవాలని ప్రయత్నించగా.. టెంపోతో స్మగ్లింగ్ గ్యాంగ్ ఢీకొట్టి చంపేసింది.

    అరెస్టు చేసిన నిందితుల్లో అస్గర్ అలియాస్ మకాడియా అన్సారీ, టెంపో డ్రైవర్ అని తెలుస్తోంది. జావేద్ షేక్, జమీల్ షేక్, ఖలీల్ షేక్ మహారాష్ట్రలోని భివాండి నివాసితులు. ఇతర నిందితులు అతుల్ గ్రామానికి చెందిన అన్సర్ షేక్ కాగా.. అలీ మురాద్ అలీసర్, హసన్ అలీసార్ వంకల్ గ్రామానికి చెందిన వారు, ధర్మపూర్ తాలూకాలోని బార్సోల్ గ్రామానికి చెందిన ధర్మేష్ అహిర్, కమలేష్ అహిర్, జయేష్ అహిర్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అరెస్టయిన 10 మందిపై ఐపిసి సెక్షన్ 304 కింద అభియోగాలు మోపారు. ‘వల్సాద్ నుండి భివాండి మరియు మహారాష్ట్రలోని ఇతర ప్రదేశాలకు పశువులను సరఫరా చేసే నెట్‌వర్క్ వీరిదని.. పరారీలో ఉన్న మరికొందరిని త్వరలోనే కనిపెడతాము ”అని వల్సాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజ్‌దీప్‌సింగ్ జాలా మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో ఆవులను అక్రమంగా రవాణా చేసిన కేసులో వీరిలో ఐదుగురు నిందితులను గతంలోనే అరెస్టు చేశారు. నిందితులపై గుజరాత్ ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ పశువుల (నియంత్రణ) చట్టం, మోటారు వాహనాల చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

    చనిపోయిన హార్దిక్ కన్సార్ కు పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందింది. ధరంపూర్-వల్సాద్ రహదారిలోని బామ్ క్రీక్ వంతెన వద్ద పశువులను తీసుకెళ్లే టెంపో ఆ రహదారి గుండా వెళుతుందని హార్దిక్ కు తెలిసింది. టెంపోని ఆపడానికి హార్దిక్ రోడ్డు మధ్యలో ఒక ట్రక్కును ఆపాడు. హార్దిక్ ట్రక్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు టెంపో డ్రైవర్ ఆపకుండా హార్దిక్ మీదుగా వాహనాన్ని నడిపాడు. ఈ ఘటనలో హార్దిక్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హార్దిక్ మరణించాడు. కొద్దిసేపటి తరువాత నిందితులు టెంపోని వదిలించుకున్నారు. పశువులను బన్సోల్ గ్రామం నుండి రవాణా చేస్తున్నట్లు, మహారాష్ట్రలోని భివాండికి తీసుకుని వెళుతున్నట్లు వల్సాద్ పోలీసులు కనుగొన్నారు. హార్దిక్ మామయ్య వల్సాద్‌లోని బిజెపి జిల్లా అధ్యక్షుడు హేమంత్ కన్సార్ అని తెలుస్తోంది. హార్దిక్ మృతి పట్ల పలువురు సంతాపం వక్తం చేశారు. గోరక్షణ కోసం ప్రాణాలను కూడా త్యాగం చేశాడని స్నేహితులు, సన్నిహితులు చెప్పుకొచ్చారు.

    Related Stories