International

ప్రపంచం మొత్తానికి మేలు చేసిన లాక్ డౌన్

కరోనా మహమ్మారి ప్రబలగానే ఎన్నో దేశాలు లాక్ డౌన్ ను అమలు చేశాయి. లాక్ డౌన్ విధించని చాలా దేశాలు పెద్ద ఎత్తున మరణాలను చవి చూశాయి. మొదటి వేవ్ సమయంలో భారత్ కూడా లాక్ డౌన్ విధించి కరోనాను కట్టడి చేయగలిగిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఎన్నో అధ్యయనాలు కూడా లాక్ డౌన్ ప్రపంచానికి మేలు చేసిందని అంటున్నాయి. తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో సంయుక్తంగా చేసిన అధ్యయనంలో కూడా అదే విషయమే బయటకు వచ్చింది. ఒక్క కరోనా మహమ్మారిని కట్టడి చేయడమే కాకుండా.. చాలా అంటురోగాలు కూడా ప్రబలకుండా అడ్డుకుందట లాక్ డౌన్. దీంతో లాక్ డౌన్ వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగామని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో అధ్యయనం చెబుతోంది. లాక్ డౌన్ తో కరోనాతో పాటు న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ జబ్బుల సంక్రమణ కూడా భారీగా తగ్గిందని పేర్కొంది.

ప్రొఫెసర్ డేవిడ్ ముర్డోచ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏడు మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ జబ్బుల సంక్రమణ ద్వారా ప్రపంచంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతూ వచ్చారని.. ఆ మరణాలను లాక్ డౌన్ ద్వారా తగ్గించగలిగామని ముర్డోచ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ లాగానే ఆయా వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలూ శ్వాసకోశ వ్యవస్థ ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయని.. ప్రపంచ వ్యాప్త లాక్ డౌన్ లతో గత ఏడాది జనవరి నుంచి మే మధ్య ఆ వ్యాధులకు సంబంధించిన కేసులు భారీగా తగ్గాయని ఈ నివేదిక తెలిపింది.స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే కేసులు.. లాక్ డౌన్ విధించిన 4 వారాల్లో స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే కేసులు 68 శాతం, 8 వారాల్లో 82 శాతం మేర తగ్గాయని స్పష్టం చేసింది.

26 దేశాలకు చెందిన జాతీయ లేబొరేటరీలు, నిఘా కార్యక్రమాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాలకు వచ్చారు. ఒక్క 2016లోనే ప్రపంచవ్యాప్తంగా 33.6 కోట్ల మంది శ్వాసకోశ జబ్బుల బారిన పడగా, 24 లక్షల మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్లతో పోలిస్తే ప్రతి దేశంలోనూ కేసులు సగటున 6 వేలు తగ్గాయని తెలిపింది. కోవిద్-19 కట్టడికి తీసుకున్న చర్యల ద్వారా ఇతర అంటువ్యాధులను కూడా ప్రపంచ వ్యాప్తంగా బాగా కట్టడి చేశారని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − 6 =

Back to top button