More

  కాంగ్రెస్ కక్కుర్తి.. బయటపడిన భారీ కుంభకోణం..!

  హస్తం పార్టీ దేశంలో ఎక్కడ అధికారంలో వున్నా.. తన హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తుందని మరోసారి నిరూపితమైంది. శవాలమీద పేలాలు ఏరుకున్నట్టు.. కరోనా కష్టకాలంలోనూ స్కాంగ్రెస్ నాయక శిఖామణులు తమ చేతివాటం చూపిస్తున్నారు. లూటీ చేయడంలో తమ అనుభవం ముందు ఎవరూ సాటిరారని నిరూపిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను.. ఎక్కువ ధరకు ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మి సొమ్మ చేసుకున్న పంజాబ్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో స్కామ్ కు తెరతీసింది. కరోనా బాధితులకు అందించే ఔషధ కిట్ల విషయంలోనూ కాసుల కక్కుర్తి ప్రదర్శించింది. భారత జవానుగా సేవలందించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పాలనలోనే.. ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోంది.

  ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత పంజాబ్ లో స్కాముల సీజన్ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమమే సమయం ఉండటంతో.. తమ అధికార పార్టీ తమ ఖజానా నింపుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి సేకరించిన కోవిడ్ -19 వ్యాక్సిన్లను.. అధిక ధరకు ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మి.. అభాసుపాలైన అమరీందర్ సర్కార్.. ఇప్పుడు మరో స్కామ్ కు తెరతీసింది. అదే ‘ఫతే కిట్’ కుంభకోణం. కరోనా బాధితులకు అందించడానికి పంజాబ్ ప్రభుత్వం ‘ఫతే కిట్’ పేరుతో మెడికల్ కిట్లను పంపిణీ చేస్తోంది. ఇందులో ఈ కిట్ లో పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్, ఫేస్ మాస్క్‌లు, స్టీమర్, శానిటైజర్, విటమిన్ సి మరియు జింక్ టాబ్లెట్లతో పాటు.. వైరస్ ప్రభావాన్ని తగ్గించే కొన్ని రకాల మందులు ఉంటాయి. ఈ కిట్ల కోసం టెండర్లను పిలిచిన అమీరందర్ ప్రభుత్వం.. తన కాసుల కక్కుర్తిని ప్రదర్శించింది. మొదటి టెండర్ వ్యవధి ఆరు నెలలు వున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ కిట్లను మూడు వేర్వేరు టెండర్ల క్రింద కొనుగోలు చేసింది.

  కొవిడ్ బాధితులకు ఇవ్వాల్సిన 20 రకాల మందులతో కూడి ఈ కిట్ కోసం.. పంజాబ్ ప్రభుత్వం గత ఏప్రిల్ లో టెంటర్లు పిలిచింది. ఇందులో 837 రూపాయల అతి తక్కువ ధరను కోట్ చేసిన కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఆరునెలల పాటు చెల్లుబాటయ్యేలా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ, ఈ వ్యవధి పూర్తికాకుండానే మరో టెండర్ ను పిలిచింది. ఇందులో 1,226 రూపాయల చొప్పున 50 వేల కిట్లను కొనుగోలు చేసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. అదే వెండర్ కు కిట్టుకు 1,338 రూపాయల చొప్పున చెల్లించి.. లక్షా 50 వేల కిట్లను కొనుగోలు చేసింది. ఇలా మొదటి టెండర్ అగ్రిమెంట్ పూర్తికాకుండానే.. అదీ ఎక్కువ ధర చెల్లించి కిట్లను కొనుగోలు చేసింది.

  మొదటి టెండర్‌లోనూ కోట్ చేసిన ధర కంటే.. పంజాబ్ సర్కార్ ‘ఫతే కిట్స్’ కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి టెండర్ కిట్‌కు 837 రూపాయల చొప్పున చెల్లిస్తే.. అదే విక్రేత నుండి కొన్ని వేల కిట్లను 940 రూపాయల అధిక ధరతో ఆర్డర్ చేసింది. ఆ తర్వాత మొదటి టెండర్ అగ్రిమెంట్ పూర్తికాకుండానే.. రెండో టెంటర్ పిలిచి.. కిట్‌కు 1,226 రూపాయల చొప్పున కేటాయించింది. అదికూడా మెడికల్ లైసెన్స్ లేని ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది అమరీందర్ సర్కార్. దీంతో టెండర్ల ప్రక్రియలో గోల్ మాల్ జరిగినట్టు అనుమానాలు వెల్లువెత్తాయి.

  తమ ఖజానా నింపుకోవడాని కరోనా సంక్షోభాన్ని పక్కాగా ఉపయోగించుకున్నారని అమరీందర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫతే కిట్ల కుంభకోణంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ విషయంలో పంజాబ్ సూట్ బూట్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వీడాలన్నారు. వ్యాక్సిన్ల అమ్మకాల్లో లాభాలు ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందో.. పంజాబ్ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని న్నారు. ఈ కుంభకోణంపై సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

  ఇక, ఇది పక్కా కుంభకోణమని.. డ్రగ్ లైసెన్స్ లేని ఓ సంస్థ.. కనీసం ప్రమాణాలు పాటించని సంస్థతో ఎలా ఒప్పందం చేసుకుంటారని.. విపక్ష శిరోమణి అకాలీదల్ నేతలు మండిపడుతున్నారు. ఈ కుంభకోణంపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని, దోషులకు శిక్షించాలని ఆ పార్టీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. అటు విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఫతే కిట్ల కుంభకోణంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కొవిడ్ టైమ్ లో కుంభకోణాలతో రికార్డులు తిరగరాస్తోందని.. పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, ఎంపీ భగ్వంత్ సింగ్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఢిల్లీకి చెందిన ఓ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్.. ఈ కుంభకోణాన్ని ‘డిజాస్టర్ అపార్చునిటీ’గా అభివర్ణించారు.

  Trending Stories

  Related Stories