Sports

ఇంగ్లండ్ లోని భారత క్రికెట్ జట్టులో ఇద్దరికి కరోనా పాజిటివ్

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో ఇద్దరు కరోనా బారినపడ్డారని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్లు వెల్లడించాయి. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు బృందంలో 23 మంది ఉన్నారు. వీరిలో కరోనా బారినపడింది ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. కరోనా బారినపడిన ఆ క్రికెటర్లలో ఎలాంటి లక్షణాలు లేవని, వారిలో ఒకరు ఇప్పటికే కోలుకోవడంతో అతనికి పరీక్షలో నెగటివ్ వచ్చిందని తెలుస్తోంది. మరో క్రికెటర్ ని మాత్రం క్వారంటైన్‌లో ఉంచినట్టు సమాచారం. క్వారంటైన్‌లో ఉన్న ఆ క్రికెటర్‌ తప్ప మిగతా క్రికెటర్లు డర్హమ్‌కు బయలుదేరారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత క్రికెటర్లకు మూడు వారాల విరామం ఇచ్చారు. దీంతో ఎవరికి వారు పర్సనల్ టూర్ వేశారు. డబ్ల్యుటిసి విరామం తర్వాత వెళ్లిన క్రికెటర్లలో కొందరు కరోనా బారిన పడడంతో అభిమానులు కాస్తా భయపడుతూ ఉన్నారు. టూర్ లో ఉన్న ఆటగాళ్లలో కనీసం ఒక ఆటగాడు COVID-19 పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా సంఖ్య ఎక్కువ ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. పాజిటివ్‌ వచ్చిన ఆటగాడు డర్హామ్‌కు వెళ్లడం లేదని తెలుస్తోంది. అక్కడ భారత జట్టు గురువారం మధ్యాహ్నం సమావేశమై జూలై 20 నుండి కౌంటీ ఛాంపియన్‌షిప్ ఎలెవన్ జట్టుతో మూడు రోజుల మ్యాచ్ కు సిద్ధం కానుంది.

భారత ఆటగాళ్లపై పరీక్షలు నిర్వహిస్తున్న ఇంగ్లాండ్‌లోని జాతీయ ఆరోగ్య సేవ త్వరలో పేరును తెలియజేయనుంది. డబ్ల్యుటిసి ఫైనల్ తర్వాత వచ్చిన ఈ మూడు వారాల బ్రేక్ సందర్భంగా సదరు పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు రద్దీ ప్రదేశాలలో కనిపించారని తెలుస్తోంది. డర్హామ్‌లోని శిబిరంలో ఉన్న ఆటగాళ్లకు మొదటి రౌండ్ పరీక్ష గత శనివారం (జూలై 10) జరిగింది మరియు బుధవారం (జూలై 14) మరో రౌండ్ పరీక్షలు చేయడం జరిగింది. తొలి రౌండ్ తర్వాత భారత ఆటగాడికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. యుకెలో COVID-19 కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ఇటీవల ఇంగ్లండ్ జట్టులో ఏడుగురు సభ్యులకు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే..!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

twelve + thirteen =

Back to top button