More

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు.. ఏపీలో ఆగని కరోనా ఉధృతి

    ఏపీలో గడచిన 24 గంటల్లో 89,535 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,383 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అనంతపురం జిల్లాలో 2,975 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,884 కేసులు గుర్తించారు. గత 24 గంటల్లో 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 98 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,11,320 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11,94,582 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,07,467 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 9,271కి పెరిగింది.
    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 64,362 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 601 కేసులు గుర్తించారు. మేడ్చల్ లో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గత 24 గంటల సమయంలో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. 32 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007కి పెరిగింది. 4,69,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2,928కి చేరింది.
    ఏపీలో గత కొద్దిరోజులుగా 20వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ ఉండడం.. అధికారులను కలవరపెడుతూ ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మాట్లాడుతూ దేశంలో 8 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ఆ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువవుతోందని తెలిపింది. 8 రాష్ట్రాల జాబితాలో ఏపీ 5వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశమే..! 11 రాష్ట్రాల్లో 1 లక్షకు పైన యాక్టివ్ కేసులు ఉన్నాయని, దేశం మొత్తం మీద 10 రాష్ట్రాల నుంచి 85 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతం దాటిందని తెలిపింది. జాతీయ రికవరీ రేటు పెరిగిందని, ప్రస్తుతం దేశంలో కరోనా రోగులు కోలుకుంటున్న శాతం 83.83గా ఉందని తెలిపింది.

    Trending Stories

    Related Stories