More

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల అప్డేట్స్

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 71,616 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 225 కేసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. 5,186 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం. అదే సమయంలో 27 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,36,766 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. 4,85,644 మంది కోలుకున్నారు. 48,110 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 3,012కి చేరింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రికవరీ రేటు 90.47 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 85.6 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.56 శాతంగా ఉంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 91,253 కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2,923 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 2,804 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,630 కేసులు, విశాఖ జిల్లాలో 2,368 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 21,274 మంది కోలుకోగా, 99 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య 9,580కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,75,372 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 12,54,291 మంది కోలుకున్నారు. 2,11,501 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories